రాష్ట్రీయం

కేంద్రమా..నీవే దిక్కు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 19: రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో కేంద్ర నిధులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వీలైనంత మేరకు కేంద్ర నిధులను రాష్ట్రానికి కేటాయించేలా ప్రయత్నాలు ప్రారంభించింది. విభజన తరువాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో వివిధ సంక్షేమ పథకాల అమలులో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. విభజన సమయంలో పేర్కొన్న మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా 7వేల కోట్ల రూపాయలు విడుదల కావాల్సి ఉంది. పెద్దనోట్ల రద్దుతో రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్‌ల శాఖ ఆదాయం సగానికి పడిపోయింది. దాదాపు 5వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేయగా, 2600 కోట్ల రూపాయల మేరకు మాత్రమే వస్తుందని తాజా అంచనాలు తెలియచేస్తున్నాయి. ద్రవ్యలోటు దాదాపు 24 వేల కోట్ల రూపాయలకు చేరింది. రెవెన్యూ లోటు కూడా 15వేల కోట్ల రూపాయలకు చేరింది. నిధులు సమస్యగా మారడంతో గత 11రోజులుగా ట్రెజరీల్లో బిల్లుల చెల్లింపులను నిలిపివేశారు. ఈనేపథ్యంలో కేంద్రం నుంచి వివిధ పథకాల కింద వచ్చే నిధులను మరింతగా రాబట్టే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే ‘నరేగా’ కింద 6వేల కోట్ల రూపాయలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయించగా, వచ్చే సంవత్సరానికి 7వేల కోట్ల రూపాయలను కేటాయించేందుకు కేంద్రం ముందుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం విద్య, రోడ్లు, పట్టణాభివృద్ధి, అటవీ, పర్యావరణం, స్ర్తి శిశు సంక్షేమం, వైద్యం, వివిధ కమ్యూనిటీ భాగస్వామ్య కార్యక్రమాల కింద నిధులు ఎక్కువగా కేటాయిస్తుంది. విడతల వారీగా విడుదలయ్యే ఈ నిధులకు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయాల్సి ఉంటుంది. ఖర్చు చేసిన నిధులకు ధ్రువీకరణ పత్రాలను కేంద్రానికి పంపాలి. ఆ తరువాత మిగిలిన వాయిదాలకు సంబంధించిన నిధులు విడుదల చేస్తుంది. చాలా సందర్భాల్లో నిధులను ఖర్చు చేసినట్లు ధ్రువీకరణ పత్రాన్ని పంపడంలో జాప్యం జరగటం వల్ల నిధుల విడుదలలోనూ జాప్యం జరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారులతో ఇటీవల ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశంలో కేంద్ర నిధులపై దృష్టి సారించాలని సూచించారు. వివిధ పథకాల కింద వీలైనన్ని నిధులను రాబట్టేలా ప్రతిపాదనలను సిద్ధం చేసి పంపాలని ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ కేటాయింపులు పరిశీలించి, ఈమేరకు ప్రతిపాదనలు పంపాలని కోరారు. ఆర్థిక మంత్రి యనమల కూడా ఇదే విషయమై అధికారులను ఆదేశించారు. కేంద్ర నిధులతో కొంతమేరకు రాష్ట్ర ఖజానాపై భారం తగ్గుతుందని భావిస్తున్నారు.