తెలంగాణ

మున్సిపాలిటీలకు ఇక రేటింగ్ -- రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: తెలంగాణలో 72

మున్సిపాలిటీల ఆర్థిక స్థితిని అంచనావేసి వాటికి

రేటింగ్‌లను ఇవ్వాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ

నిర్ణయించింది. ఈ మున్సిపాలిటీల పనితీరును

అంచనావేసే బాధ్యతను దేశంలోని ప్రముఖ

సంస్థలకు అప్పగించనున్నారు. ఐసిఆర్‌ఏ, క్రెసిల్,

ఫిచ్ తదితర సంస్థలకు ఐదు మున్సిపాలిటీల

చొప్పున అప్పగిస్తారు. ఈ ఏజెన్సీలు మున్సిపాలిటీల

ఆర్థిక స్థితి, పరిపాలన తీరు, నిధులు, దీర్ఘకాలిక

ప్రణాళికలు, వివిధ అభివృద్ధి పథకాలకు నిధులు

వ్యయం చేసిన తీరును అంచనా వేస్తాయి. అనంతరం

ప్రతి మున్సిపాలిటీకి క్రెడిట్ రేటింగ్స్‌ను ఇస్తాయి. ఈ

మొత్తం ప్రక్రియ వచ్చే నెలాఖరులోపల పూర్తి

చేయనున్నారు. కేంద్ర, రాష్ట్రాలు ఇచ్చిన నిధులు,

వౌలిక సదుపాయాలకు ఖర్చుపెట్టిన వైనం, పన్నుల

వసూళ్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిధులకోసం

ఏమేరకు ఆధారపడుతున్నాయో అంశాలను ఈ

ఏజెన్సీలు అధ్యయ నం చేస్తాయి. ఈ వివరాలను

డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ టికె శ్రీదేవి

చెప్పారు. సెక్యూరిటీస్ ఎక్స్ఛేం జ్ బోర్డు ఆఫ్

ఇండియా (సెబి) మున్సిపాలిటీలకు సం బంధించి

నిర్ణయం తీసుకుంది. నిధుల రాబడి, వ్య యాన్ని

ఆడిట్ చేసి మిగులు నిధులు చూపించిన

మున్సిపాలిటీలు మున్సిపల్ బాండ్స్‌ను విడుదల

చేయవచ్చు. మూడేళ్ల పాటు ఆర్థికంగాబాగుండడమే

కాకుండా, రికార్డులను నిర్వహించవలసి ఉంటుంది.

అలాగే ఏ రుణ ఏజెన్సీకి కూడా మున్సిపాలిటీలు

బకా యి ఉండరాదు. వీటిని దృష్టిలో పెట్టుకుని

రాష్ట్రప్రభుత్వం ఆదేశం మేరకు మున్సిపాలిటీల ఆర్థిక

పరిస్థితిపై సర్వే చేయించి రేటింగ్‌లు ఇవ్వాలని

మున్సిపల్ పరిపాలన శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో

40 వరకు కమిషనర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

చాలా మున్సిపాలటీల్లో ఇన్‌చార్జి మున్సిపల్

కమిషనర్ల పాలన జరుగుతోంది.

సీనియర్ అధికారులకు అడ్మినిస్ట్రేటివ్ స్ట్ఫా కాలేజ్

ఆఫ్ ఇండియాలో శిక్షణ ఇచ్చేందుకు మున్సిపల్

కమిషనరేట్ విభాగం కసరత్తును ప్రారంభించింది.

తాజా రిక్రూట్‌మెంట్ ద్వారా మున్సిపల్ కమిషనర్ల

నియామకం ఆలస్యమవుతుంది.