ఆంధ్రప్రదేశ్‌

‘పురుషోత్తపట్నం’ రెండో దశ సర్వే మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 19: గోదావరి నది ఎడమ

గట్టుపై పురుషోత్తపట్నం వద్ద రాష్ట్ర ప్రభుత్వం

ప్రతిష్ఠాత్మకంగా నిర్మించతలపెట్టిన ఎత్తిపోతల పథకం

ఇంకా భూసేకరణ దశ నుంచి బయటపడలేదు. ఈ

ప్రాజెక్టు కింద భూములు కోల్పోయేదంతా సన్న,

చిన్నకారు రైతులే. ఈ భూములపై ఆధారపడిన

కౌలు రైతుల్లో తమ ఉపాధి కోల్పోతున్నామనే బెంగ

నెలకొంది. పొలాలు పోతే మా బతులకు భరోసా

ఏమిటని వాపోతున్నారు. ప్రస్తుతం పురుషోత్తపట్నం

పథకంలో రెండోదశ భూ సర్వే చేపట్టారు. పోలవరం

ఎడమ ప్రధాన కాల్వ ద్వారా ఏలేరు ఆయకట్టుకు

నీటిని మళ్ళించడం, ఏలేరు రిజర్వాయర్‌లోకి

గోదావరి నీళ్ళను ఎత్తిపోయడం ఈ పథకం

ముఖ్యోద్ధేశ్యం. ఈ పథకంలో రెండు చోట్ల

పంపుహౌస్‌ల నిర్మాణం చేపడతారు. మొత్తం ఈ

రెండు చోట్లా కలిపి 298.65 ఎకరాల భూమి

అవసరంగా గుర్తించారు. ఇందులో పురుషోత్తపట్నం

పంపుహౌస్ వద్ద 203.65 ఎకరాలను 320 మంది

రైతుల నుంచి సేకరించాల్సి వుంది. పోలవరం ఎడమ

ప్రధాన కాల్వ 57 కిలో మీటర్ల వద్ద నిర్మించే

పంపుహౌస్ నిర్మాణం కోసం జగ్గంపేట, ఏలేశ్వరం

మండలాల పరిధిలోని మర్రిపాక, కోళ్ళకుంట,

ఇర్రిపాక, మానుకోట, ఏలేశ్వరం గ్రామాలకు చెందిన

95.18 ఎకరాలు సేకరించాల్సివుంది. మొదటి దశలో

పురుషోత్తపట్నం వద్ద నిర్మించే మొదటి పంపుహౌస్

వద్ద భూసేకరణ ప్రక్రియ చేపట్టగా రెండో దశలో

ప్రస్తుతం రెండో పంపుహౌస్ వద్ద భూ సేకరణకు

సంబంధించి సర్వే నిర్వహిస్తున్నారు. మొదటి దశ

భూసేకరణకు సంబంధించి కొన్ని చోట్ల ఎకరాకు

రూ.24 లక్షలు, మరి కొన్ని చోట్ల రూ.25 లక్షలు,

ఇంకొన్ని చోట్ల రూ.28 లక్షల చొప్పున నష్టపరిహారం

ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. అయితే రైతులు

అంగీకార పత్రాలు ఇచ్చిన వారం లోగా పరిహారం

చెల్లించేందుకు రెవెన్యూ అధికారులు

కసరత్తుచేస్తున్నారు. అయితే దాదాపు రెండు

వందల మంది వరకు రైతులు ఇందుకు

అంగీకరించినట్టు అధికారులు పేర్కొంటున్నారు.

మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.1638 కోట్లు కాగా

ఇందులో భూ సేకరణకు దాదాపు రూ.58 కోట్లు

వరకు చెల్లించాల్సి వుంటుందని ప్రాధమికంగా

అంచనా వేశారు. ఇది ప్రాజెక్టు అంచనాలో

ఎక్కువేనని భావిస్తున్నారు. అయితే పట్టిసీమలో

గరిష్ఠంగా చెల్లించిన రూ.50 లక్షల వరకు పరిహారం

ఇవ్వాలని, ఇక్కడ నష్టపోయిన భూమిని మరో చోట

కొనుగోలు చేసుకునే విధంగా తమకు పరిహారం

ఉండాలని రైతులు అంటున్నారు. ఇప్పటికే రెండు

మూడు పథకాల్లో నష్టపోయాం కాబట్టి పరిహారం

చట్టం ప్రకారం రెట్టింపుస్థాయిలో ఇవ్వాల్సి

వుంటుందని రైతులు అంటున్నారు. అయితే

అధికారులు మాత్రం అత్యధికంగా రూ.28 లక్షలు

చెల్లిస్తున్నామని చెబుతున్నారు.
ఒకే ప్రాజెక్టు కింద ఒకే పరిహారం చెల్లించాలనే

చట్టబద్ధ నిబంధన అమలు చేయాలని రైతులు

కోరుతున్నారు. భూసేకరణకు చట్టబద్ధ ప్రక్రియను

అనుసరించాలని రైతులు అంటున్నారు.

ఏదేమైనప్పటికీ వచ్చే ఖరీఫ్ నాటికి ఏలేరు

ఆయకట్టుకు సాగునీరివ్వాలని, ఆగస్టుకల్లా

పురుషోత్తపట్నం పథకం పనులు పూర్తి చేయాలని

లక్ష్యంగా పనులు చేపట్టారు.