తెలంగాణ

నరుూం కేసులో పురోగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: గ్యాంగ్‌స్టర్ నరుూం కేసులో సిట్ పురోగతి సాధించింది. 2016 ఆగస్టు 8న ఎన్‌కౌంటర్‌లో హతమైన నరుూం, అతని అనుచరులపై ఇప్పటి వరకు 197 కేసులు నమోదైనట్టు సిట్ చీఫ్ నాగిరెడ్డి తెలిపారు. నరుూం కేసును దర్యాప్తు జరుపుతున్న సిట్ 125 మంది నిందితులను అరెస్టు చేసింది. 330 మందిపై పిటివారంట్ జారీ చేసింది. వివిధ కేసుల్లో మరో 107 మందిని విచారించింది. ఈ కేసులో మొత్తం 878 మంది సాక్ష్యులను విచారించినట్టు సిట్ చీఫ్ నాగిరెడ్డి తెలిపారు. వివిధ కేసుల్లో 18 చార్జిషీట్లు దాఖ లు చేశామని, 14 మందిపై పిడియాక్టు పెట్టామని నాగిరెడ్డి వివరించారు. పాశం శ్రీను, సందెల సుధాకర్, అబ్దుల్ నాసర్, బచ్చు నాగరాజ్, పులి నాగరాజు, సరగడ హరి, కత్తుల జంగయ్య, సామ సంజీవరెడ్డి, మహమ్మద్ తబ్రేజ్, గుమ్మడవల్లి శ్రీనివాస్, షేక్ జహంగీర్, షేక్ జానీపాషా, షేక్ అబ్దుల్లా, మహమ్మద్ ముబీన్‌లపై పిడియాక్టు పెట్టామని, దర్యాప్తు తుది దశకు చేరిందని నాగిరెడ్డి తెలిపారు.