తెలంగాణ

సెట్‌టాప్ బాక్స్‌ల కేసులో హైకోర్టు తీర్పు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: సెట్ టాప్ బాక్స్‌ల ఏర్పాటుపై హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. జనవరి 31లోగా అన్ని మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో సెట్‌టాప్ బాక్స్‌లు ఏర్పాటు చేయాలని పేర్కొంటూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను కేబుల్ ఆపరేటర్లు సవాలు చేశారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్‌రంగనాధన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ కేబుల్ ఆపరేటర్ల పిటీషన్లను విచారించి తీర్పును రిజర్వు చేసింది. పిటీషనర్ల తరఫున సి రామచంద్రరాజు హాజరై కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ హక్కులకు భంగకరమని పేర్కొన్నారు.
ఎసిబి కోర్టు ఆదేశాలు పక్కన పెట్టండి
స్పెషల్ ఎసిబి కోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టాలని సీనియర్ ఐఎఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం హైకోర్టును ఆశ్రయించారు. రహేజా మైండ్ స్పేస్ కేసులో స్పెషల్ కోర్టు ఆదేశాలను పక్కన పెట్టాలని ఆయన కోరారు. ఎల్వీసుబ్రహ్మణ్యం తరఫున టి నిరంజన్ రెడ్డి పిటీషన్ దాఖలు చేయగా, దానిని జస్టిస్ బి శివశంకరరావు విచారించారు. ఎపిఐఐసి ఎండిగా ఉన్న సమయంలో మాదాపూర్‌లో సరిపడా స్థలం లేక నానక్‌రాం గూడాలోని స్థలాన్ని రహేజా సంస్థకు అధికార హోదాలో బదలాయించారని పేర్కొన్నారు. 2005 మే 12న ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారని, తర్వాత ఆయన అక్కడి నుండి బదిలీ అయ్యారని, తర్వాత ఏం జరిగిందో తెలియదని పిటీషనర్ కోర్టుకు వివరించారు.