తెలంగాణ

‘డబుల్ బెడ్‌రూం’కు 5వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: బడ్జెట్‌లో గృహ నిర్మాణ, దేవాదాయ, న్యాయశాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై ఆ శాఖల అధికారులతో మంత్రి ఇం ద్రకరణ్‌రెడ్డి సోమవారం సమీక్ష జరిపారు. 2017-18 బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి ఎక్కువ నిధు లు కేటాయించాలని కోరనున్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలో, ముఖ్యమంత్రి ప్రత్యేక కోటా మినహా 95 నియోజక వర్గాల్లో లక్షా 33వేల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు అధికారులు మంత్రికి వివరించారు. 95 నియోజక వర్గాల్లో ప్రతి నియోజక వర్గానికి 14వందల ఇళ్లను కేటాయించనున్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర బడ్జెట్ అంచనా వ్యయం సుమారు మూడు వేల కోట్ల రూపాయలు కాగా, హడ్కో నుంచి సుమా రు 17 వందల కోట్ల రూపాయల రుణం తీసుకోవలసిన అవసరం ఉన్నట్టు అధికారులు తెలిపారు. మొత్తం మూడు లక్షల పదివేల డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణానికి సుమారు 20వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. సమీక్షలో గృహ నిర్మాణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్, హౌసింగ్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ ఈశ్వరయ్య పాల్గొన్నారు.
దేవాదాయ శాఖకు వంద కోట్లు
దేవాదాయ శాఖ బడ్జెట్ అంచనాలపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులతో సమీక్ష జరిపారు. బలహీన వర్గాల కాలనీల్లో కామన్ గుడ్ ఫండ్ పథకం కింద నిర్మించే ఆలయాలకు సుమారు వంద కోట్ల రూపాయల అంచనా వ్యయంగా అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపాదనల మేరకు నిధులు కేటాయించాలని ఆర్థిక శాఖను కోరనున్నారు. సమీక్షలో దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ శ్రీనివాసరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సెక్రటరీ రమేశ్ ఇతర అధికారులు పాల్గొన్నారు. అదే విధంగా న్యాయశాఖకు సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలపై న్యాయశాఖ సెక్రటరీ సంతోశ్‌రెడ్డితో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చర్చించారు.

చిత్రం..అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి