తెలంగాణ

కాంగ్రెస్ ఆవేదనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీపేట, ఫిబ్రవరి 20: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆదివారం నిర్వహించినది జన ఆవేదన సభ కాదని, అది కాంగ్రెస్ ఆవేదన, జానారెడ్డి, షబ్బీర్‌అలీల ఆవేదన సభ అని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. సోమవారం నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్‌సింగ్ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని, ఆయనకు తెలంగాణ గురించి అవగాహన లేదన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా దిగ్విజయ్‌సింగ్ ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆమె అన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కొన్ని రాష్ట్రాలకే పరిమితమైందని, ఒక ప్రాంతీయ పార్టీగా తన అస్థిత్వాన్ని కోల్పోయిందని, రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కోల్పోవాల్సి వస్తుందనే భయంతోనే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజా సంక్షేమం కోసం మంచి సలహాలు, సూచనలు ఇవ్సాల్విందిపోయి, ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. ఉద్యమ సమయంలో 10 సంవత్సరాల పాటు అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు విషయంలో స్పష్టమైన వైఖరి ప్రకటించకపోవడం వల్లే వందలాది మంది యువకులు, విద్యార్థులు ఆత్మబలిదానాలకు పాల్పడ్డారని కవిత గుర్తు చేశారు. టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎంపిలు పార్లమెంట్‌లో మాట్లాడటం వల్లే జిల్లాలో రైలు, ఎఐఎంఎస్ వచ్చాయని, ఈ విషయాన్ని శాసనమండలి పక్ష నేత షబ్బీర్‌అలీ తెలుసుకోవాలన్నారు. తమకు ఇ.డి నోటీసులు వచ్చాయంటూ కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని, ఒకవేళ ఇ.డి నోటీసులు జారీ చేస్తే ఆ విషయం ఎంతమాత్రం దాగదని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించేందుకు ప్రతిపక్ష పార్టీగా తమవంతు సలహాలు, సూచనలు ఇస్తే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.