తెలంగాణ

ఊరి బాగు చూద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం ద్వారా గ్రామాల సమగ్రాభివృద్ధి సాధించాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీలకు మరిన్ని అధికారాలు బదలాయించాలని, ఖాళీగావున్న పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేయాలని సిఎం నిర్ణయించారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై లోతుగా అధ్యయనం చేసేందుకు సంబంధిత మంత్రి కె తారకరామారావు అధ్యక్షతన మంత్రులు, అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు సిఎం ప్రకటించారు. గ్రామ పంచాయతీలకు అధికారాలు, విధులు, బాధ్యతలు అప్పగించే విషయంలో లోతైన అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని కెటిఆర్‌ను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో ఆదివారం మంత్రులు కెటిఆర్, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సిఎస్ రాజీవ్‌శర్మ, కరీంనగర్ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి ఎస్పీ సింగ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ అనితా రామచంద్రన్ తదితరులతో సిఎం కెసిఆర్ సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో పరిశుభ్ర వాతావరణం సాధించాలని సిఎం సూచించారు. గ్రామాభివృద్ధిలో గ్రామ పంచాయతీల పాత్ర కీలకమైంది కావడంతో వాటిని బలోపేతం చేయాలని సూచించారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతోపాటు గ్రామ పరిధిలో, పాఠశాలలో పారిశుధ్య నిర్వహణ, మొక్కల పెంపకం, పిచ్చి మొక్కలు, చెట్ల తొలగింపు, కుక్కల నివారణ, మురికిగుంటలు లేకుండా చూడటం వంటి కార్యక్రమాలు గ్రామ పంచాయతీలే నిర్వహించాలన్నారు. గ్రామాల్లో నెలకొన్న అపరిశుభ్ర వాతావరణంవల్ల ప్రజలు అంటువ్యాధుల బారిన పడుతున్నారని, పరిశుభ్ర వాతావరణం నెలకొల్పితే ఆ పరిస్థితి ఉండదన్నారు. గ్రామ సర్పంచులు, కార్యదర్శులు, గ్రామాభివృద్ధి విషయంలో, అలాగే గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచే విషయంలో మరింత బాధ్యతాయుతంగా ఉండేందుకు అవసరమైన అన్నిరకాల సహకారాలు ప్రభుత్వం అందించాలని ఆదేశించారు. స్వచ్ఛ తెలంగాణలో భాగంగా చెత్త సేకరణకు గ్రామ పంచాయతీలకు 25 వేల సైకిల్ రిక్షాలు వీలైనంత త్వరగా అందించాలని చెప్పారు. ఖాళీగావున్న పంచాయతీ కార్యదర్శుల పోస్టులను కూడా భర్తీ చేయాలని, కస్టర్లవారీగా కార్యదర్శులను నియమించాలని సిఎం ఆదేశించారు. అవసరమైతే మరిన్ని పోస్టులను కూడా మంజూరు చేయడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామాల్లో డంపుయార్డుల ఏర్పాటు, స్మశాన వాటికల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గ్రామ పంచాయతీల ద్వారా ప్రజలకు కావాల్సిన పనులు, ఇవ్వాల్సిన అనుమతులు సకాలంలో అందించేలా మార్గదర్శకాలు రూపొందించాలని సిఎం ఆదేశించారు. గ్రామ పంచాయతీలను పటిష్టం చేయడం కోసం వారి బాధ్యతను మరింత పెంచేలా విధివిధానాలు ఖరారు చేసి, అవసరమైతే శాసనసభ సమావేశాలల్లోనే చట్టం తెచ్చేందుకు సహకరించాలని అధికారులకు సూచించారు. పంచాయతీరాజ్ మంత్రి కెటిఆర్ నేతృత్వంలో మంత్రులు, అధికారులు పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి, గ్రామ పంచాయతీలకు అధికారాలు, విధులు, బాధ్యతలు అప్పగించే అంశాన్ని లోతుగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

చిత్రం తెలంగాణలో నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి మార్గం సుగమం చేసినందుకు ఆదివారం హైదరాబాద్‌లో సిఎం కెసిఆర్‌ను అభినందిస్తున్న కరీంనగర్ రైతాంగం