తెలంగాణ

ఉపాధ్యాయుల పదోన్నతులకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 21: పంచాయితీరాజ్, ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలల ఉపాధ్యాయులకు కోర్టు ఆదేశాలకు లోబడి పదోన్నతులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కోర్టు ఆదేశాలు ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని కోర్టు ధిక్కారం కింద కేసును స్వీకరించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్లను కోర్టు ధర్మాసనం విచారించింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది కెఆర్ ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ పంచాయితీరాజ్, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను వేరు క్యాడర్లగా నిర్ణయించి సీనియారిటీ జాబితాను ఖరారు చేసి పదోన్నతులు ఇవ్వాలని కోరారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసులపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెచ్చిన చట్టాన్ని హైకోర్టు ధర్మాసనం 2007 ఫిబ్రవరి 28వ తేదీన కొట్టేసింది. అనంతరం సుప్రీం కోర్టు కూడా 2015లో హైకోర్టు తీర్పును సమర్థించింది. ఉపాధ్యాయుల పదోన్నతులపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది జె రామచంద్రరావు వాదలు వినిపిస్తూ ప్రత్యేక క్యాడర్లుగా పరిగణించి ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అనంతరం హైకోర్టు ఈ కేసు విచారణను మార్చి 1వ తేదీకి వాయిదా వేసింది.