తెలంగాణ

కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 21: తెలంగాణ రాష్ట్రంలో రైతాంగ ఆత్మహత్యలను నిరోధించేందుకు, గిట్టుబాటు ధరలు లభించేందుకు వీలుగా కేంద్రం వద్దకు అఖిల పక్షం తీసుకెళ్లాలని కల్వకర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి, మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి, పిసిసి అధికార ప్రతినిధి కొనగాల మహేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు ధాన్యానికి గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించామన్నారు. సన్నధాన్యానికి క్వింటాల్‌కు ఐదారువందల రూపాయలు వరకు రైతులు నష్టపోతున్నారన్నారు. కందులకు ధర లేదని బోనస్ ఇవ్వాలన్నారు. మార్కెటింగ్ మంత్రి హరీష్ రావు ప్రతిపక్షాలనువిమర్శించడం మానివేసి రైతుల బాధలపై దృష్టిపెట్టాలన్నారు. ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి మాట్లాడుతూ బిసిల పట్ల కెసిఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. బడ్జెట్‌లో బిసిల సంక్షేమానికి రూ.6798 కోట్లు కేటాయించి ఖర్చు చేసింది అంతంత మాత్రమేనన్నారు. జనాభా ప్రాతిపదికన బిసిలకు నిధులు కేటాయించాలన్నారు. ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ నీరు కార్చుతున్నార్నారు. పిసిసి అధికార ప్రతినిధి కొనగాల మహేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్సెట్ స్కామ్‌సెట్‌గా మారిందన్నారు. టెండర్లు లేకుండా ఎంసెట్ నిర్వహణ ఒక ప్రైవేట్ సంస్ధకు అప్పగించారన్నారు. ఎంసెట్ టెండర్లు రద్దు చేయాలన్నారు. కాంగ్రెస్ మాజీ ఎంపి వి హనుమంతరావు మాట్లాడుతూ బిసిల విద్యకు సమగ్రాభివృద్ధితో చర్యలు తీసుకోకుండా గొర్రెలు, చేపల తాయిలాలతో ఎన్నాళ్లని మోసం చేస్తారన్నారు. కెసిఆర్ తాయిలాలను తీసుకునేందుకు బిసి యువత సిద్ధంగా లేదన్నారు.