తెలంగాణ

పరిణామాలకు బాధ్యత ప్రభుత్వానిదే: రేవంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 21: తెలంగాణ నిరుద్యోగ జెఏసి నిర్వహించతలపెట్టిన ర్యాలీలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
బుధవారం ఇందిరాపార్కు వద్ద శాంతియుతంగా నిర్వహించబోయే ర్యాలీ, సభకు అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ర్యాలీలో అసాంఘిక శక్తులు చొరబడే అవకాశం ఉందనే సాకుతో ర్యాలీకి అనుమతివ్వకపోవడం విచారకరమన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో రాజ్య హింసను వౌనంగా భరిస్తూ శాంతియుత పోరాటాలతో రాష్ట్ర సాధనకు పోరు నడిపిన సందర్భంలో ఆంధ్ర పాలకులు మోపిన కేసులను మీరు అస్త్రాలుగా వాడుకోవడం దేనికి సంకేతమని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. స్వరాష్ట్ర పాలన కంటే నాటి ఆంధ్ర పాలకుల పాలనే నయం అన్న భావనను సిఎం కెసిఆర్ నిరుద్యోగ యువతలో కల్పించారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా నిరుద్యోగ యువత తలపెట్టిన శాంతియుత ర్యాలీకి అనుమతివ్వాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
భేషజాలకు వెళ్లకుండా యువత ఆకాంక్ష, ఆవేదనను వినే ప్రయత్నం చేయాలని ఆయన పాలకులకు సూచించారు.