తెలంగాణ

పోలీసుల ఉక్కుపాదం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 21: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఉద్యమ సమయంలో టెన్షన్ ఉన్నట్లు ఇప్పుడు మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్‌ను పోలీసులు దాదాపు గృహ నిర్బంధం చేశారు. బుధవారం ఉదయం ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చి, సుందరయ్య విజ్ఞాన కేంద్రం వైపు వెళ్ళే ప్రయత్నం చేస్తే అరెస్టు చేసేందుకు పోలీసులు ఆయన ఇంటి వద్ద సిద్ధంగా ఉన్నారు. బుధవారం (22న) హైదరాబాద్‌లో నిరుద్యోగ నిరసన ర్యాలీ నిర్వహించేందుకు టి.జెఎసి పిలుపునివ్వడం, ప్రభుత్వం అనుమతిని నిరాకరించడంతో టిజెఎసి అనుబంధ విభాగమైన విద్యావంతుల వేదిక హైకోర్టులో అనుమతి కోసం పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా హైకోర్టు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సూచనలు చేయడం, దానికి టి.జెఎసి నిరాకరించి, యధావిధిగా ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలి పిలుపు కాబట్టి టి.జెఎసి కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించి తీరాలన్న పట్టుదలతో ఉంది. ఇప్పటి వరకు ఓడిపోలేదు, భవిష్యత్తులోనూ ఓడిపోం అని టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అంటున్నారు.
ముందుగా ప్రకటించిన విధంగా హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్కు వరకు ర్యాలీ నిర్వహించాలన్న పట్టుదలతో టి.జెఎసి ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలన్న పట్టుదలతో పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు. ర్యాలీని భగ్నం చేయలేకపోతే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తమపై నిప్పులు చెరిగే ప్రమాదం ఉందన్న భయమూ పోలీసు ఉన్నతాధికారులకు లేకపోలేదు. దీంతో వారు జిల్లాల నుంచి నిరుద్యోగులు హైదరాబాద్‌కు బయలుదేరకుండా ఎక్కడికక్కడ అరెస్టు చేయడం ఆరంభించారు. సాయంత్రం వరకు 600 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు టి.జెఎసి ఆరోపిస్తున్నది. బాగ్‌లింగంపల్లి దరిదాపుల్లోకి నిరుద్యోగులు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా బహిరంగ సభ నిర్వహించాలనుకున్న ఇందిరా పార్కు దారులన్నీ అర్ధ రాత్రి మూసి వేసేందుకు పోలీసు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందిరా పార్కు పక్కనే ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో సాయంత్రానికి 500 మంది పోలీసులు మోహరించారు. అంతేకాకుండా ఇందిరా పార్కు నుంచి బాగ్‌లింగంపల్లి రోడ్డుపై పోలీసులు భారీగా మోహరించారు.
ఉస్మానియా వర్సిటీ..
మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నిరుద్యోగులు, విద్యార్థులు ర్యాలీగా బయలుదేరే అవకాశం ఉన్నందున, వర్సిటీ ప్రధాన గేట్ల వద్ద మంగళవారం సాయంత్రానికి వందల సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు.
బారికేడ్లు సిద్ధం చేసుకున్నారు. దూసుకుని వచ్చే వారిని అదుపు చేసేందుకు లాఠీ ప్రయోగం చేయకుండా జాగ్రత్తగా అరెస్టులు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు కింది స్థాయి అధికారులను ఆదేశించారు. లాఠీలు ఝుళిపిస్తే ప్రభుత్వానికి అప్రతిష్ట వస్తుందేమోనని, నిరుద్యోగులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేసే ప్రమాదం ఉందన్న ఆలోచనతో ఉన్నారు.
కొనసాగుతున్న మంతనాలు..
ఇలాఉండగా ప్రభుత్వ వ్యూహాన్ని ఛేదించుకుని చొచ్చుకుని వెళ్ళేందుకు ప్రొఫెసర్ కోదండరామ్, టి.జెఎసి నేతలతో రాత్రి పొద్దుపోయేంత వరకూ మంతనాలు చేస్తూనే ఉన్నారు. జిల్లాల నుంచి నిరుద్యోగులు ఫోన్లు చేస్తున్నారు. ఏదో ఒక మార్గంలో దూసుకుని రావాలని, ఇది భవిష్యత్తును నిర్దేశించే పోరాటం అని ఆయన చెబుతున్నారు.
ఒక చానల్‌లో ఇంటర్వ్యూ ఇచ్చేందుకు వెళ్ళడానికి బయటకు వెళ్ళాలన్న వంకతో ఇంటి నుంచి మరో ప్రాంతానికి చేరుకోవాలని ప్రొఫెసర్ కోదండరామ్ ప్రణాళిక రూపొందించుకున్నట్లు తెలిసింది.