తెలంగాణ

సర్కారు ధోరణి నిరంకుశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 22: ‘రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహారించింది’ అని టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం కోదండరామ్ పోలీసు స్టేషన్ నుంచి విడుదలయ్యాక ఆగ్రహంతో వ్యాఖ్యానించారు. బుధవారం ఉదయం పోలీసులు ఆయనను అరెస్టు చేసి కామాటిపురా పోలీసు స్టేషన్లో సాయంత్రం వరకు ఉంచారు. సాయంత్రం విడుదలైన తరువాత మీడియాతో మాట్లాడేందుకూ పోలీసులు అవకాశం ఇవ్వకుండా ఆయన్ను తార్నాకలోని నివాసానికి తరలించారు. నివాసంలో ప్రొఫెసర్ కోదండరామ్ మీడియాతో మాట్లాడుతూ తెల్లవారకముందే ‘ముందస్తు’ పేరిట తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులు దౌర్జన్యంగా తలుపులు బద్ధలుకొట్టి బలవంతంగా లాక్కెళ్లారన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి తమ కార్యాచరణ కొనసాగుతుందని, గురువారం ఉదయం టిజెఎసి సమావేశం నిర్వహిస్తామన్నారు. విద్యార్థి సంఘాలు నిర్వహిస్తున్న నేటి విద్యాసంస్థల బంద్‌నకు మద్దతు ప్రకటించారు.