తెలంగాణ

ఆసరాకు 5054 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 22: ఆసరా పెన్షన్ల కోసం రూ.5054 కోట్లు, ఒంటరి మహిళల పెన్షన్ల కోసం రూ.247 కోట్లను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రతిపాదించింది. రోడ్ సౌకర్యం లేని 459 గ్రామాలలో సిసి రోడ్లు, 500కు పైగా జనాభా కలిగిన 262 గిరిజన తండాలు, 336 దళిత వాడలకు రోడ్ సౌకర్యం కల్పించాలని ప్రతిపాదించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2017-18) బడ్జెట్‌లో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖల ప్రతిపాదనలపై సెర్ఫ్ కార్యాలయంలో బుధవారం పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధిశాఖల కమిషనర్ నీతుప్రసాద్‌తో పాటు సంబంధిత అధికారులతో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కసరత్తు చేశారు. దేశంలో మరే రాష్ట్రంలో అమలు చేయని విధంగా రాష్ట్రంలో విస్తృతంగా అమలు చేస్తున్న ఆసరా పింఛన్లకు ఈ ఏడాది రూ. 5054 కోట్లు ఖర్చు అవుతుందని ప్రతిపాదించారు. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అమలు చేయనున్న ఒంటరి మహిళల పెన్షన్ల కోసం అదనంగా మరో రూ.247 కోట్లను ప్రతిపాదించింది. ఫించన్ల పంపిణీలో జాప్యం జరుగకుండా, లబ్ధిదారులకు అసౌకర్యం కలగకుండా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఫించన్లు పోస్ట్ఫాస్‌ల ద్వారానే పంపిణీ చేయాలని నిర్ణయించింది. పోస్ట్ఫాసుల ద్వారా పెన్షన్లు అమలు అంశంపై చర్చించడానికి మార్చి ఒకటిన ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించారు. గ్రామీణాభివృద్దిశాఖ అమలు చేస్తున్న 21 పథకాలకు అవసరమైన నిధుల కేటాయింపు ప్రతిపాదనలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. పాత జిల్లా కేంద్రాల మాదిరిగా కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రాలలో కూడా కోటి రూపాయల వ్యయంతో మహిళా సమాఖ్య భవనాలు నిర్మించడానికి రూ.21 కోట్లు ప్రతిపాదించింది. అలాగే అన్ని జిల్లా కేంద్రాలలో నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేసి గ్రామీణ యువతకు స్వయం ఉపాధిపై శిక్షణ ఇవ్వడానికి అవసరమైన నిధులు కేటాయించాలని ప్రతిపాదించింది. స్వామి రామనందతీర్థ గ్రామీణ సంస్థ ద్వారా శిక్షణ కార్యక్రమాల నిర్వహణను మరింత మెరుగు పర్చడానికి నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల ఇవ్వడానికి ‘స్ర్తి నిధి’ బ్యాంక్‌కు ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. రాష్టవ్య్రాప్తంగా రోడ్ సౌకర్యం లేని 459 గ్రామాలలో సిసి రోడ్లు నిర్మించాలని ప్రతిపాదించింది. రోడ్ సౌకర్యం లేని 500కు పైగా జనాభా కలిగిన 262 గిరిజన తండాలు, 336 దళిత వాడలకు రోడ్లు నిర్మించాలని ప్రతిపాదించింది.
సెర్ఫ్ కార్యాలయంలో ప్రాజెక్టు మేనేజర్‌గా పని చేసే వేణుగోపాల్ గత డిసెంబర్‌లో విధి నిర్వహణలో గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన భార్య లతను అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా నియమిస్తూ నియామక పత్రాన్ని ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు అందజేశారు. మృతుడు వేణుగోపాల్ పిల్లలకు గురుకుల పాఠశాలలో ప్రవేశంతో పాటు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజురు చేస్తున్నట్టు మంత్రి ప్రకటించారు.