తెలంగాణ

నేడు విద్యాసంస్థల బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 22: నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని శాంతియుతంగా ర్యాలీ నిర్వహించతలపెట్టిన ప్రొఫెసర్ కోదండరాం సహా యువకులు, విద్యార్థులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ గురువారం విద్యాసంస్థల బంద్ నిర్వహించనున్నట్టు ఒయు ఐకాసా నేతలు తెలిపారు. రెండు రోజులుగా రాజకీయ ఐకాస తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీ ఉద్రిక్తంగా మారిందని, ఒక పక్క పోలీసులు ఎక్కడికక్కడ నిరసనకారులను నిలువరించి అదుపులోకి తీసుకుంటున్నా ఆందోళనకారులు తమ నిరసనలు ఆపుచేయలేదు. ఈ నేపథ్యంలో కోదండరాంను అరెస్టు చేయడంపై విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చినట్టు ఒయు ఐకాసా నేతలు పేర్కొన్నారు. ఎబివిపి, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, కెవిపిఎస్, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల సాధన సంఘం, సిఐటియు నేతలు వేర్వేరు ప్రకటనల్లో ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. టిఆర్‌ఎస్ నిజస్వరూపాన్ని నిర్బంధం బయటపెట్టిందని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె భాస్కర్, ప్రధానకార్యదర్శి టి స్కైలాబ్ బాబు అన్నారు. నిరుద్యోగ ర్యాలీపై ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించి అక్రమ అరెస్టులకు పాల్పడిందని రిజర్వేషన్ల సాధన సంఘం అధ్యక్షుడు జాన్ వెస్లి, కార్యదర్శి శ్రీరాం నాయక్‌లు ఆరోపించారు. ప్రభుత్వ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు సిఐటియు అధ్యక్షుడు రాములు, ప్రధాన కార్యదర్శి సాయిబాబులు పేర్కొన్నారు.