తెలంగాణ

పాపినేనికి సాహిత్య పురస్కారం ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 22: ప్రసిద్ధ రచయిత పాపినేని శివశంకర్‌కు బుధవారం ఢిల్లీలోజరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సాహిత్య అకాడమి పురస్కారాన్ని అందజేశారు. రజనీగంథ పేరిట రాసిన కవితా సంకలనానికి శివశంకర్‌కు 2016వ సంవత్సరంలో సాహిత్య అకాడమి పురస్కారం దక్కింది. 24 భాషల్లో 24 మంది రచయితలకు బుధవారం పురస్కారాలు అందించారు. కామని ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి సాహిత్య అకాడమి అధ్యక్షుడు డాక్టర్ విశ్వనాథ్ ప్రసాద్ తివారి హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగానే ఈ పురస్కారాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాడమి అవార్డుల ప్రాధాన్యతను వివరించారు. సాహిత్యం అతిపెద్ద మాధ్యమమని, ఇంత వరకూ చేరని వారికి సాహిత్యాన్ని చేరువ చేసిన రచయితలకు ఈ పురస్కారాలను అందించామని అన్నారు. మార్చి 12 నాటికి అకాడమి 60 ఏళ్లు పూర్తిచేసుకుంటుందని, ఈ సందర్భంగా వారం పాటు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు ఆయన వివరించారు. వౌనాన్ని ఛేదించే శక్తి సాహిత్యానికే ఉందని పేర్కొన్నారు. ప్రసిద్ధ మరాఠీ రచయిత డాక్టర్ జయంత్ విష్ణు నర్లికర్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీట్ ది ఆథర్ కార్యక్రమాన్ని ఇండియన్ ఇంగ్లీషు రచయిత రూపా బజ్వాతో నిర్వహించారు. అనంతరం సంథ్యా పురేచ భరతనాట్యం కార్యక్రమం అందర్నీ ఆకట్టుకుందని సాహిత్య అకాడమి కార్యదర్శి డాక్టర్ కె శ్రీనివాసరావు తెలిపారు. తెలుగు పుస్తక ఎంపిక కమిటీలో డాక్టర్ కొలకలూరి ఇనాక్, మునిపల్లి రాజు, ప్రొఫెసర్ ఎస్వీ రామారావులు జ్యూరీ సభ్యులుగా వ్యవహరించారు.