తెలంగాణ

ఇద్దరి ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 22: తెలంగాణ జెఎసి ఆధ్వర్యంలో బుధవారం ఉస్మానియా యూనివర్శిటీలో చేపట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుంటుండగా కొంతమంది పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొడుతుండగా సందీప్ అనే విద్యార్థి తన ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంటుండగా పోలీసులు అతణ్ని వారించారు.
దీంతో ఓయూలో కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కమాన్‌కు ఆందోళనకారులు నిప్పంటించారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో వచ్చి మంటలనార్పారు. అదేవిధంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్‌వికె) వద్ద జస్టిస్ చంద్రకుమార్ నేతృత్వంలో విద్యార్థి, నిరుద్యోగ జెఎసి ర్యాలీకి సిద్ధమవ్వగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఓ యువతి తన చున్నీని మెడకు చుట్టుకొని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా ఆమెను అడ్డుకున్నారు. పలువురు నిరసనకారులను అరెస్టు చేసి గాంధీనగర్, అంబర్‌పేట, తార్నాక పోలీస్ స్టేషన్లకు తరలించారు.

హైదరాబాద్ పోలీస్ క్యాంపులా మారింది

సిపిఐ నేత నారాయణ

ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: హైదరాబాద్ పోలీస్ క్యాంపుగా మారిపోయిదని, పాకిస్తాన్ సరిహద్దుగా మార్చేశారని సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ అన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలోని ఏపీ భవన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్‌పైకి మాత్రమే భక్తుడిలా కనిపిస్తున్నారని, లోపల నరహంతకుడిగా కనిపిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఉద్యోగాలు ఇవ్వండి అని విద్యార్ధులు అడుగుతున్న కోరిక న్యాయబద్ధమైనదని, అందుకే కోదండరామ్, వామపక్షాలు వారికి మద్దతు తెలిపారని వెల్లడించారు. కోదండరామ్‌ను, విద్యార్ధి నాయకులను అప్రజాస్వామికంగా అరెస్టు చేశారని ఆయన దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుపతిలో భక్తుడిగా కనిపిస్తూ ఇక్కడ మానవత్వం లేకుండా కర్కశంగా ఎలా ప్రవర్తించగలిగారని, ఇది కేసీఆర్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని నారాయణ విమర్శించారు. తక్షణం పోలీసులు కోదండరామ్‌ని, విద్యార్ధి సంఘాల నాయకులను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
చంద్రబాబు కేంద్రానికి బానిస
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి బానిసలాగా వ్యవహరిస్తున్నారని సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ విమర్శించారు. బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగినా, అందులో ప్రత్యేక ప్యాకేజీ చట్టబద్ధత క్యాబినెట్ ఎజెండాలో అంశమే లేదని, చర్చ కూడా జరగలేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీ చట్టబద్ధత పేరుతో ఇలా ఎన్ని రోజులు తెలుగు ప్రజాలకు అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తారని మండిపడ్డారు. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రులు ప్రచారం చేశారని, ప్రత్యేక హోదా రాదు కానీ, కేంద్ర ప్రకటించిన ప్యాకేజీకి చట్టబద్ధత వస్తుందని ప్రచారం చేసి బుధవారం కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోకుండా తుస్సుమనిపించారని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతూ మరోవైపు కేంద్రానికి బానిసలాగా వ్యవహరిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజలకు న్యాయం చేయాలని, లేదంటే ప్రజలు తిరగబడతారని ఆయన హెచ్చరించారు.

కోదండరాం
పార్టీ పెట్టినా నష్టంలేదు

హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 22: తెలంగాణ జెఏసి చైర్మన్ కోదండరాం కొత్తపార్టీ పెట్టినా నష్టమేమీలేదని, తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకంగా కొందరు కుట్రపన్నుతున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం నాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ, ప్రొఫెర్ కోదండరాం వెనుక కొన్ని రాజకీయ శక్తులున్నాయని, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కుటిల యత్నాలు చేస్తున్నారన్నారు. నగరంలో నిర్వహించతలపెట్టిన ర్యాలీకి అనుమతిపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కోదండరాం పట్టించుకోకుండా మంకుపట్టుతో ర్యాలీ నిర్వహణకు పూనుకోవడం సమంజసం కాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన ఉందని, ఇప్పటి వరకు రాష్టవ్య్రాప్తంగా వివిధ శాఖల్లో 30 వేల ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. ఉద్దేశపూర్వకంగానే నిరుద్యోగులను అడ్డుపెట్టుకొని ప్రభుత్వంపై దాడికి పాల్పడుతున్నారని ఆరోపించారు.

తమిళనాడులో తెలుగు భాష

పునరుద్ధరణకు సహకరించండి

కెసిఆర్‌కు రాష్ట్ర తెలుగు సంఘాల విజ్ఞప్తి

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 22: తమిళనాడులో తెలుగు భాషను కాపాడుకునేందుకు సహకరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు తమిళనాడు తెలుగు యువశక్తి విజ్ఞప్తి చేసింది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు విచ్చేసిన సిఎం కెసిఆర్‌ను యువశక్తి ప్రతినిధులు కలిశారు. తాము చేస్తున్న ఉద్యమానికి ఒక తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అండదండలు అందించాలని కోరినట్లు యువ శక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తమ విజ్ఞప్తికి స్పందించిన సిఎం కెసిఆర్ హైదరాబాద్ వచ్చి తనను కలవాలని తెలిపినట్లు కేతిరెడ్డి వివరించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు చేపట్టిన ఉద్యమం జల్లికట్టు ఉద్యమం కన్నా ఎంతో గొప్పదని తెలియజేసే విధంగా తమిళనాడులో కూడా తాము గోడపత్రికలను అంటించడం ద్వారా తెలియజేశామన్నారు. తమిళనాడులో తెలుగువారికి స్ఫూర్తి కలిగించడానికి తామంతా తిరుపతికి చేరుకున్నామని, దీనిలో భాగంగానే స్వాగత ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేశామని ఆయన వివరించారు.

కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం
ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: హైదరాబాద్‌లో ఫ్రొఫెసర్ కోదండరామ్, విద్యార్ధి సంఘాల నాయకుల అరెస్టులను నిరసిస్తూ ఎఐఎస్‌ఎఫ్ విద్యార్ధి సంఘం అధ్వర్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్ ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధ చేశారు. ఈ మేరకు ఎఐఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వలీ ఉల్లాఖాన్ ఖాద్రి మాట్లాడుతూ ఇంటికో ఉద్యోగం ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పడు నిరుద్యోగులను అరెస్టు చేయడం దారుణమన్నారు. అర్హులైన విద్యార్ధులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు మార్చకోకుంటే సర్కారుపై ప్రజలు, విద్యార్ధులు తిరగబడతారని ఆయన హెచ్చరించారు.

‘ఆ పోలీసులపై చర్య తీసుకోవాలి’

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 22: ప్రొఫెసర్ కోదండరాం అరెస్టుపై ఆయన భార్య సుశీల పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇంట్లో ఉన్న తన భర్త కోదండరాంను బుధవారం తెల్లవారు జామున 3 గంటలకు ఇంటి తలుపులు పగులగొట్టి అరెస్టు చేయడంపై నిలదీశారు. కోదండరాంను అరెస్టు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
గవర్నర్‌ను కలిసే యత్నం
కోదండరాం అరెస్టును ఖండిస్తూ, అతని అక్రమ అరెస్టు తీరును వివరించేందుకు కోదండరాం భార్య సుశీల రాష్ట్ర గవర్నర్‌ను కలిసేందుకు విఫలయత్నం చేశారు. గవర్నర్ ఇంటి ముందు సుశీలను పోలీసులు అడ్డుకున్నారు. గవర్నర్‌ను భద్రతా సిబ్బంది కలువనీయకపోవడంతో ఆమె హెచ్‌ఆర్‌సిని ఆశ్రయించారు. తన భర్త అక్రమ అరెస్టుపై ఆమె ఫిర్యాదు చేశారు.
27లోగా నివేదికకు
హెచ్‌ఆర్‌సి ఆదేశం
తన భర్త అక్రమ అరెస్టుపై చర్య తీసుకోవాలని కోరుతూ కోదండరాం భార్య సుశీల హెచ్‌ఆర్‌సిని ఆశ్రయించారు. కోదండరాంను ఎందుకు అరెస్టు చేశారో, ఇంటి తలుపులు పగులగొట్టాల్సిన అవసరం ఏమిటో? తెలపాలంటూ ఆమె హెచ్‌ఆర్‌సిని కోరారు. దీంతో ఈనెల 27లోగా కోదండరాం అరెస్టుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని హెచ్‌ఆర్‌సి నగర పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది.