ఆంధ్రప్రదేశ్‌

అనంత జెఎన్‌టియుకు వనె్నతెచ్చిన సర్కార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, ఫిబ్రవరి 22: అనంతపురం జెఎన్‌టియూకు విసి సర్కార్ వనె్నతెచ్చారని చెప్పాలి. 2015 అక్టోబర్ 26న జెఎన్‌టియూ అనంతపురం ఉపకులపతిగా సర్కార్ బాధ్యతలు చేపట్టారు. యూనివర్సిటీలో ఆడిటోరియం నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులు చేయించారు. విద్యార్థుల హాస్టల్స్‌లో కనీస సౌకర్యాలు కల్పించారు. విద్యార్థులకు అవసరమైన స్కిల్ డెవలంప్‌మెంట్ శిక్షణ కోసం ఇతర దేశాల యూనివర్సిటీలతో ఒప్పందాలు చేసుకున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపునకు కృషి చేశారు. ఎన్‌ఎస్‌ఎస్ జాతీయ అవార్డు అందుకుని విశ్వవిద్యాలయం పేరును జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు.
ఎయు అభివృద్ధికి విశేష కృషి
విశాఖపట్నం: కడప వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అనంతపురం జెఎన్‌టియు వైస్ ఛాన్స్‌లర్ ఎంఎంఎం సర్కార్ ఆంధ్రా యూనివర్శిటీలో విశేష సేవలందించారు. 2015 వరకూ ఎయులో పనిచేసిన ఆయన ఆ తరువాత అనంతపురం జెఎన్‌టియు విసిగా వెళ్లారు. సర్కార్ 1953 ఏప్రిల్ మూడో తేదీన జన్మించారు. 1975లో ఆంధ్రా యూనివర్శిటీలో గుర్తింపు పొందిన కాకినాడ ఇంజనీరింగ్ కళాశాల్లో మెకానికల్ బిఇ చేశారు. 1977లో ఎయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో మిషన్ డిజైన్‌లో ఎంఇ పూర్తి చేశారు. 1997లో ఖరగ్‌పూర్ ఐఐటిలో మెకానికల్ ఇంజనీరింగ్‌లో పిహెచ్‌డి చేశారు. 200 నుంచి 2013 వరకూ ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కళాశాల్లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2011 నుంచి 2013 మధ్య ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ విభాగ శాఖాధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014 ఆగస్ట్ 18 నుంచి 2014 మార్చి రెండో తేదీ వరకూ ఒడిశా రాష్ట్రంలోని గుణుపూరు గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగ శాఖాధిపతిగా పనిచేశారు. గ్రాఫిక్ ఇంజనీరింగ్ విద్యార్థులకు గెస్ట్ లెక్చర్స్ ఇచ్చారు. 2015 అక్టోబర్ 26న జెఎన్‌టియు వైస్ ఛాన్స్‌లర్‌గా సర్కార్ బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నారు. సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సర్కార్ మరణించడంతో ఎయులో విషాద ఛాయలు అలముకున్నాయి. సర్కార్ మృతికి ఎయు వైస్ ఛాన్స్‌లర్ నాగేశ్వరరావు తదితరులు సంతాపం తెలిపారు.
శారు.

తెలంగాణ మంత్రి పోచారానికి అస్వస్థత
ఆంధ్రభూమి బ్యూర్
తిరుపతి, ఫిబ్రవరి 22: శ్రీవారి దర్శనార్థం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ వెంట తిరుమలకు వచ్చిన ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసు రెడ్డి బుధవారం స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. అధికారులు వెంటనే ఆయన్ని తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బుధవారం ఉదయం 9గంటలకు కెసిఆర్ తోపాటు పోచారం స్వామివారిని దర్శించుకుని ఆలయం నుండి అతిథి భవనానికి తిరుగు ప్రయాణమైయ్యారు. ఈక్రమంలో తనకు ఛాతి వద్ద నొప్పిగా ఉందని పోచారం చెప్పడంతో తక్షణం ఆయన్ను క్షణాల్లో తిరుమలలోని అశ్విని ఆస్పత్రిలోవున్న అపోలో హృదయ కేంద్రాలయానికి తరలించారు. ఈసందర్భంగా డాక్టర్లు ఆయనకు తక్షణం చికిత్స చేశారు. లోబిపి వల్ల అస్వస్థతకు గురైనట్లు తేల్చారు. తిరుమల జెఇఓ శ్రీనివాసరాజు స్వయంగా ఆయనకు దగ్గరుండి చికిత్స చేయించారు. సమాచారం తెలుసుకున్న టిటిడి ఇఓ సాంబశివరావు పోచారంను పరామర్శించారు.

విదేశీ ఎగుమతి, దిగుమతులకు
ఎటిఎ కార్‌నెట్ అండ

ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 22: దేశీయ ఉత్పత్తులను విదేశాల్లో ప్రదర్శించడం ద్వారా మార్కెటింగ్ చేసుకునేందుకు ఎటిఎ కార్‌నెట్ అండగా ఉంటుందని కస్టమ్స్ కమిషనర్ బి హరేరామ్ అన్నారు. ఫిక్కీ (ఎఫ్‌ఐసిసిఐ) ఆధ్వర్యంలో విశాఖలో బుధవారం జరిగిన ఇనె్వస్టర్స్ మీట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కస్టమ్ శాఖ చట్టపరిధిలో ఫిక్కీ ఆధ్వర్యంలో అందించే ఎటిఎ కార్‌నెట్ విదేశాల్లో వస్తువులను ప్రదర్శించేందుకు తాత్కాలిక అనుమతులు మంజూరు చేయించేందుకు మధ్యవర్తిగా వ్యవహరిస్తుందన్నారు. ఉత్పత్తిదారుల పాస్‌పోర్ట్, వీసా, ఇతర కస్టమ్స్ ఫార్మాలిటీస్‌ను కార్‌నెట్ తీరుస్తుందన్నారు. ఇప్పటికే ఎటిఎ కార్‌నెట్ 76 దేశాల్లో నెట్‌వర్క్ కలిగి ఉందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా దేశీయ ఉత్పత్తులను విదేశాల్లో ప్రదర్శించడం, వాటికి మార్కెటింగ్ ప్రచారం నిర్వహించుకునేందుకు దోహదపడుతుందన్నారు. కస్టమ్స్,ఎక్సైజ్ అండ్ సర్వీస్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ విశ్రాంత సభ్యుడు పిఎస్ పృథి మాట్లాడుతూ విదేశాలకు దేశీయ ఉత్పత్తులు, ప్రొఫెషనల్ సామగ్రిని విదేశాలకు తరలించాలంటే ఒకప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారని అన్నారు. ఎపి కార్‌నెట్ ఏర్పాటుతో ఫిక్కీ తీసుకున్న చర్యల ద్వారా ఈ ప్రక్రియ సులభతరమైందన్నారు. ఒకే డాక్యుమెంట్ ద్వారా సులభతరమైన ఆంక్షలతో ఉత్పత్తుల ప్రదర్శనకు అవకాశం కలుగుతుందన్నారు. ఫిక్కీ సంయుక్త సంచాలకులు విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ ఆమోదం పొందిన ఎటిఎ కార్‌నెట్ దేశ వ్యాప్తంగా 8 ప్రాంతాల్లో శాఖలను విస్తరించిందన్నారు. ఫిక్కీ తెలంగాణ, ఎపి అధ్యక్షుడు వౌనిష్‌రావ్, ఇన్సూరెన్స్ సంస్థ సీనియర్ ఇడి సిఆర్ వైద్య అఖిలేష్ మహుకార్ తదితరులు పాల్గొన్నారు.
ఎఇఓ సర్ట్ఫికెట్‌తో వ్యాపారులకు బహుళలాభాలు
ముత్తుకూరు: కృష్ణపట్నం పోర్టు ద్వారా ఎగుమతులు దిగుమతులు చేసుకునే వ్యాపారులు ఎఇఓ సర్ట్ఫికెట్ పొందాలని కస్టమ్స్ కమిషనర్ ఎస్‌కె రెహమాన్ వెల్లడించారు. బుధవారం కృష్ణపట్నం పోర్టులో నిర్వహించిన కష్టమ్స్ అథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్ (ఎఇఒ) ఎగుమతి, దిగుమతి దార్లు సమావేశానికి ఆయన హాజరైనారు. ఈసందర్భంగా ఎగుమతి, దిగుమతి దార్లకు కష్టమ్స్ సేవలపై సలహాలు సూచనలను అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎగుమతి, దిగుమతిదార్లు ఏఇఒ సర్ట్ఫికెట్ పొందడంవల్ల పలు ప్రయోజనాలు పొందవచ్చని ఆయన సూచించారు. కృష్ణపట్నం పోర్టు ద్వారా ఈ ఏడాది కష్టమ్స్ రెవెన్యూ రెండువేల కోట్ల రూపాయలు రెవెన్యూ లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఆయన వివరించారు. ఈకార్యక్రమంలో కృష్ణపట్నం పోర్టు అధికారులు తదితరులు పాల్గొన్నారు.