ఆంధ్రప్రదేశ్‌

ట్రెజరీల్లోనే బిల్లులు చెల్లింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 22: ఆర్థిక సంవత్సరం ముగింపుకు 50 రోజులు ముందు నుంచే ఉద్యోగుల జీతాలు, పెన్షన్‌లు, ప్రయాణ భత్యాలు, స్కాలర్‌షిప్‌ల నుంచి ఆసుపత్రులు, జైళ్లు, హాస్టళ్లలో డైట్ బిల్లులు వరకు.. అలాగే కాంట్రాక్టు బిల్లులు సైతం ట్రెజరీ కార్యాలయాల్లో చెల్లింపులు పూర్తిగా నిలిపివేసి 15 రోజులు దాటింది. దీన్నిబట్టి చూస్తేనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. ప్రభుత్వ పథకాలు అమలు చేసే, పర్యవేక్షించే అధికారులు, సిబ్బంది వాహనాలకు ఇంధనం చెల్లింపు స్థోమత లేని వారు తమ వాహనాలను పక్కన పెట్టేశారు. అయితే శాసనమండలి ఉపాధ్యాయ, పట్ట్భద్రుల నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎయిడెడ్ టీచర్లతో పాటు చిరుద్యోగులైన అంగన్‌వాడీ టీచర్ల జీతాల బిల్లులు, అలాగే పరీక్షలు సమీపిస్తుండటంతో హాస్టళ్లలో చదివే విద్యార్థులకు సంబంధించిన ట్యూషన్ బిల్లుల వరకు చెల్లింపులు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అనుమతించింది. మూడు రోజుల క్రితం జ్యూడిషియల్ విభాగానికి సంబంధించిన బిల్లులకు ఆమోదం తెలిపినప్పటికీ ఆర్‌బిఐ నుంచి బ్యాంక్‌లకు అనుమతి రాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు జరిపి అవసరమైన మేర బాండ్లు తాకట్టుపెట్టి అనుమతి సాధించింది. అసలు అనేకానేక ప్రభుత్వ శాఖలు ఉన్నప్పటికీ ట్రెజరీ విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి గుండెకాయ వంటిది. ప్రధానంగా ప్రభుత్వ ప్రజల ధనానికి జిల్లా సబ్‌ట్రెజరీ కార్యాలయాలు భద్రత కల్పించాల్సింది పోయి అవనీతికి కేరాఫ్‌గా మారుతున్నాయి. పలురకాల ఖర్చులు, కాంట్రాక్టర్ల బిల్లులు, జీతాల బిల్లులు, రవాణా భత్యం బిల్లులు, పెన్షన్లు, ఆర్జిత సెలవు బిల్లులు, పండుగ అడ్వాన్స్‌లు, డైట్, స్కాలర్‌షిప్‌లు, ఇలా ఒకటేమిటి ఏ బిల్లు అయినా సరే ట్రెజరీ కార్యాలయాల్లో పరిశీలన అనంతరం ఆపై బ్యాంక్‌లకు వెళ్లాల్సి ఉంది. ఏమీ అభ్యంతరాలు లేనిపక్షంలో కచ్చితంగా మూడు రోజుల్లో మంజూరు కావాలి. అయితే మామూళ్లు ఇస్తే కాని కదలని స్థితి ఉందంటున్నారు. రిటైర్ అయితే హైదరాబాద్‌లోని ఎజి కార్యాలయం నుంచి పెన్షన్ కాగితాలు ముందుగా జిల్లా కార్యాలయానికి చేరతాయి. అక్కడ కనీసం మూడు వేలు చెల్లిస్తేగాని సంబంధిత ఉప ఖజానా కార్యాలయానికి ఆ కాగితాలు చేరవంటున్నారు. తిరిగి అక్కడ వెయ్యి రూపాయలు చెల్లిస్తేనే బ్యాంక్‌కు వెళతాయి. కొత్తగా చేరిన ఉద్యోగికి ఐడి నెంబర్ కేటాయించడానికి వెయ్యి నుంచి రూ.500 వరకు చెల్లించాల్సి వస్తుందన్న ఆరోపణలున్నాయ. ఇక తపాలా గుమాస్తా నుండి డిస్పాచ్ గుమాస్తా వరకు అదే తంతు. ఉద్యోగులు బదిలీపై వెళ్లేటప్పుడు చివరి జీతం సర్ట్ఫికేట్‌ను సకాలంలో పంపించినపుడు కొత్త కార్యాలయంలో మరుసటి నెల జీతం వస్తుంది. అయితే అలా జరగటం లేదు. చివరకు ట్రెజరీ కార్యాలయానికి బదిలీపైన వచ్చే సిబ్బందికి సీటు కేటాయింపులోనూ భారీగా మామూళ్లు సమర్పించుకోవాల్సి వస్తుందని ఆరోపిస్తున్నారు.

వెయ్యి ఎకరాల
అడవి అగ్నికి ఆహుతి’
తంబళ్లపల్లె, ఫిబ్రవరి 22: చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లయ్యకొండ, సాధుకొండ అటవీ ప్రాంతం సుమారు వెయ్యి ఎకరాలు అగ్నికి ఆహుతైంది. మల్లయ్యకొండ కింద ఏనుగుమల్లయ్య గుడి ఉంది. శివరాత్రి సందర్భంగా శివాలయానికి భక్తుల రాకకు అనువుగా ఉండాలని అటవీశాఖ అధికారులు మంగళవారం మధ్యాహ్నం ట్రెంచ్ ఏర్పాటుచేశారు. ముళ్లకంచెలు, ఇతర పిచ్చిచెట్లు నరికి పోగుపెట్టి నిప్పంటించి ఇంటికి వెళ్లిపోయారు. గాలి వాటం వల్ల ఆ మంటలు అడవికి అంటుకుంది. రాత్రి తొమ్మిది గంటలకు కూడా ఆరలేదు. దీంతో అటవీ ప్రాంతంలో ఉన్న వన్యప్రాణులు, విలువైన కలప కాలి బూడిదయ్యాయి. సాధుకొండ అటవీ ప్రాంతంలో అత్యధికంగా జింకలు, నెమళ్లు ఉన్నాయి. దీంతో అడవికి నిప్పు పెట్టడంతో వాటి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఇదిలావుండగా తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో అడవికి బుధవారం నిప్పంటుకుంది.