జాతీయ వార్తలు

‘మహా’ ఉక్కుమనిషి పవార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 22: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ రాజకీయ ప్రస్థానం మొదలై ఐదు దశాబ్దాలైంది. ఈ 50 ఏళ్ల ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల్లో పవార్ అనేక ఎత్తుపల్లాలు చూశారు. జాతీయ రాజకీయాల్లో మహారాష్టక్రు ఓ ప్రత్యేక స్థానం కల్పించడంతో ఆయన కృషి మరువలేం. శరద్ పవార్ రాజకీయ ప్రయాణంపై ఆయన కుమార్తె, బారామతి లోక్‌సభ సభ్యురాలు సుప్రియా సులే అనేక విషయాలు మీడియాతో పంచుకున్నారు. 1967 ఫిబ్రవరి 22న జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పవార్ తొలిసారి పోటీ చేశారు. మొదటి ఎన్నికల్లోనే ఘన విజయం సాధించిన ఆయన మార్చి 13న శాసన సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1967 నుంచి 2017 వరకూ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పవార్ సాధించిన విజయాలపై కుమార్తె ట్వీట్ చేశారు. తండ్రికి అభినందనలు తెలుపుతూ ఆమె ఆనందం వ్యక్తం చేశారు. శరద్ పవార్‌ను మహారాష్ట్ర ఉక్కు మనిషిగా పేర్కొంటూ ఎన్‌సిపి సీనియర్ నేత ప్రఫుల్ పటేల్, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ వవార్ రాజకీయ ఉద్దండునికి అభినందనలు తెలిపారు. జాతీయ రాజకీయాల్లో 76 ఏళ్ల పవార్ పోషించిన పాత్ర మరువలేమని వారన్నారు. 1978లో 38 ఏట తొలి సారి ముఖ్యమంత్రి అయిన పవార్ మూడు పర్యాయాలు సిఎంగా పనిచేశారు.