తెలంగాణ

తెలంగాణను దెబ్బతీయడమే కోదండరామ్ అజెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 23: టిజెఎసి చైర్మన్ కోదండరామ్ తన రాజకీయ స్వార్థంకోసం విద్యార్థులను బలిపశువులుగా మార్చే కుట్రలు చేస్తున్నారని టిఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ విమర్శించారు. టిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్సీలు శ్రీనివాసరెడ్డి, శంభీపూర్ రాజు, టిఆర్‌ఎస్ నేత రాకేశ్‌లతో కలిసి మాట్లాడారు. తెలంగాణకు నష్టం చేయాలన్నదే కోదండరామ్ బ్యాచ్ అజెండా అని విమర్శించారు. ప్రభుత్వం ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు వాస్తవాలను వెల్లడిస్తున్నా, అవి పట్టనట్టుగా వ్యవహరిస్తున్న కోదండరామ్ నిరుద్యోగుల ర్యాలీకి పిలుపిచ్చి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే కుట్రలు సాగిస్తున్నారని విమర్శించారు. కోదండరామ్ ర్యాలీ అట్టర్ ప్లాప్ షోగా మిగిలిపోయిందని, జెఎసి తప్పుడు మాటలు వినకుండా తెలంగాణ విద్యార్థులు, యువత ముఖ్యమంత్రి కెసిఆర్‌పై పూర్తి విశ్వాసం కనబర్చారని అన్నారు. నిధులు, నీళ్లు, నియామకాలు అనే నినాదంతో ఉద్యమించిన టిఆర్‌ఎస్ ఈ మూడు లక్ష్యాలను సాధించేందుకు ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. విభజన నేపథ్యంలో తెలంగాణలో జరిగింది సాధారణ అధికార మార్పిడి కాదని, కొత్త రాష్టమ్రని, అనేక కష్టాలు వచ్చాయని, అధికారులు, ఉద్యోగులు చాలినంత మంది లేరని, అయినా ప్రభుత్వం రెండున్నరేళ్లుగా జనరంజక పాలన అందిస్తోందని చెప్పారు. 40లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నారని, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ వర్గాల కుటుంబాలకు చేయూత నిచ్చేందుకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు చెప్పారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి మనకున్న 1350 టిఎంసి నీటి వాటాలను వినియోగించుకుంటూ తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీటిని అందించాలని ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. వేలాది ఉద్యోగాలను నియమిస్తున్నా కోదండరామ్ మాత్రం తప్పుడు విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఆనాడు తెలంగాణకోసం రాజీనామాలు చేద్దాం అంటే చేయకుండా పారిపోయిన తెలంగాణ ద్రోహులు కాంగ్రెస్, టిడిపిలు ఇప్పుడు కోదండరామ్‌కు అండగా నిలిచారని విమర్శించారు. రెండు పార్టీలది తెలంగాణ వ్యతిరేక భావజాలమని అలాంటి పార్టీలతో కలిసి కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. తెలంగాణ వ్యతిరేకులైన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రం లాంటివారు కోదండరామ్‌కు మద్దతు ఇస్తున్నారన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్క్ వరకూ దారి పొడవునా విధ్వంసం చేయాలని చూశారని అన్నారు. వారి కుట్రలను కెసిఆర్ తప్పికొట్టారని బాల్క సుమన్ తెలిపారు.