తెలంగాణ

తమ్మిడిహట్టి, కాళేశ్వరమే శరణ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గోదావరి, కృష్ణా నదులపై పొరుగు రాష్ట్రాలు భారీ సంఖ్యలో ప్రాజెక్టులు నిర్మించాయని, ఇలాంటి పరిస్థితిలో తమ్మిడిహట్టి, కాళేశ్వరంలపై ప్రాజెక్టులు నిర్మించడమే తెలంగాణకు శరణ్యమని ముఖ్యమంత్రి కెసిఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర- తెలంగాణ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణానికి తదుపరి కార్యాచరణ రూపొందించేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, ఆ రాష్ట్ర నీటిపారుదల మంత్రి, అధికారులు త్వరలో హైదరాబాద్ రానున్నారని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ఎండాకాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మిస్తామని చెప్పారు. అధికారుల స్థాయిలో శనివారం జరిగిన చర్చలు సంతృప్తిని ఇచ్చాయని అన్నారు. పోరుగు రాష్ట్రంతో గత పాలకులు పరిష్కరించలేని దశాబ్దాల నీటి జగడానికి తెర పడడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి మార్గం సుగమం చేసినందుకు కరీంనగర్ జిల్లా రైతులు కృతజ్ఞతాపూర్వకంగా పాదయాత్రగా హైదరాబాద్‌కు వచ్చారు. ఇత్తడి, వెండి పాత్రల్లో పవిత్ర గోదావరి జలాలలను ముఖ్యమంత్రికి అందజేశారు. పెద్దపల్లి నియోజకవర్గం జూపల్లికి చెందిన 210 మంది రైతులు వారి నాయకుడు రఘువీర్‌సింగ్, జడ్‌పిటిసి ప్రీతి ఆధ్వర్యంలో మండల కేంద్రం నుంచి ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి పాదయాత్రగా వచ్చారు. వారిని ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. గత పాలకులు పొరుగు రాష్ట్రాలతో ప్రాజెక్టుల ఎత్తు పేరు మీద ఎడతెగని పంచాయితీ చేసి, కొట్లాటలు పెట్టుకొని, గోదావరి జలాలను తెలంగాణకు దక్కకుండా చేశారని ఆరోపించారు. కుట్రలకు చరమగీతం పాడి బతుకు- బతకనియ్యి అనే విధానంలో మహారాష్టత్రో తమ్మిడిహట్టి, మేడిగడ్డసహా మరో మూడు ప్రాజెక్టుల నిర్మాణాలకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు చెప్పారు. గోదావరి నది మీద సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం తాను చేపడుతున్న చర్యలను ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయని, ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణలో తమకు పుట్టగతులు లేకుండా పోతాయనే భయంతోనే ప్రతిపక్ష నేతలు అడ్డగోలు వ్యాఖ్యానాలు చేస్తున్నారని విమర్శించారు. ‘మన పెద్దోళ్లు యేం జెప్తరు... దొరికిన కాడికి తీసుకొని అటెన్క మల్ల ఎక్కువ కావాల్నని కొట్లాడుమంటరు’అని కెసిఆర్ తెలిపారు. నల్లగొండ జిల్లా ఎస్‌ఎల్‌బిసిని గత 40 ఏళ్లుగా పనులు పూర్తి చేయకుండా సొరంగం పేరుతో తవ్వుతున్న వైనాన్ని రైతులకు వివరించారు. వైఎస్‌ఆర్ హయాంలో పోతిరెడ్డిపాడు పేరుతో కృష్ణానదికి నదినే మలుపుకుపోయిన పరిస్థితి అని వివరించారు. వాళ్లు పోలవరం కట్టుకోవాలి, మనకుగూడ యేదో కట్టినట్టు జెయ్యాలె, అగో అట్ల వచ్చిందే ప్రాణహిత- చేవెళ్ల ప్రాజ్టెక్టు అని అన్నారు. ఎక్కడి ప్రాణహిత, ఎక్కడి చేవెళ్ల సాధ్యం అవుతుందా? ఎక్కడ జాగా లేనట్టు పొయ్యి తమ్మిడి హట్టి కాడ మొదలు పెట్టిన్రు’ అని కెసిఆర్ విమర్శించారు. గోదావరి, కృష్ణా నదులపై మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు ఇప్పటికే దాదాపు నాలుగు వందల బ్యారేజీలు నిర్మించాయని తెలిపారు. గోదావరి నదిపై బాబ్లీ అనేది దానికి చివరాఖరుది మాత్రమేనని అన్నారు. ఇక మనకు ఆ నదుల నీళ్ల మీద ఆశలు లేవని, వాళ్లు కట్టిన ప్రాజెక్టులతోని వాళ్ల చెరువులు, కుంటలు నిండాలి, రిజర్వాయర్లు నిండాలి, అవన్నీ నిండాక ఈ నాలుగు వందల బ్యారేజీలు నిండితే నీళ్లు కిందకు వదిలితే అప్పుడు మనకు నీళ్లు వస్తాయని వివరించారు. కరీంనగర్ జిల్లా సహా ఉత్తర తెలంగాణ జిల్లాలు ఆంధ్రలోని గోదావరి జిల్లాలను మించిపోయే రోజులు త్వరలోనే రానున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు ఇచ్చిన పవిత్ర గోదావరి జిలాలను స్వీకరించిన ముఖ్యమంత్రి, పాదయాత్రకు నాయకత్వం వహించిన జల్లెపల్లి రైతు రఘువీర్‌సింగ్‌ను సత్కరించారు. మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్యక్రమంలో పాల్గొన్నారు. పాదయాత్ర చేసిన రైతులతో కలిసి ముఖ్యమంత్రి భోజనం చేశారు.

కలశాలతో తెచ్చిన గోదావరి జలాలను
తెలంగాణ సిఎం కెసిఆర్‌కు అందజేస్తున్న కరీంనగర్ జిల్లా రైతులు