తెలంగాణ

మృతులు ఎక్కడివారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 23:రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పర్‌పల్లి-అత్తాపూర్ ఘటనలో మృతుల కుటుంబాల ఆచూకీ తెలియక పోలీసులు సతమతమవుతున్నారు. బుధవారం కూలర్ గోదాంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ సంభవించి ఆరుగురు కార్మికులు సజీవ దహనమైన విషయం తెలిసిందే.
కాగా సంఘటన స్థలాన్ని సందర్శించిన మంత్రులు బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించినా..గోదాం యజమాని అరెస్టయినా..బాధిత కుటుంబాలకు మాత్రం సమాచారం అందలేదు. మృతుల భాష, వేషధారణతో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వారని కొందరు, ఒడిశా రాష్ట్రానికి చెందినవారని కొందరు అంటున్నారు. కూలర్ల గోదాంలో పనిచేస్తూ స్థానికంగా ఉండే ఒకరిద్దరి సహకారంతో ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో మృతుల కుటుంబాలను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని, అందుకు ఒక బృందాన్ని అక్కడికి పంపినట్టు పోలీసులు తెలిపారు.
మృతుల్లో ఇర్ఫాన్, సద్దాం, అయూబ్, షారూఖ్‌లను గుర్తించారు. మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉంది. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రి మార్చురీలో భద్రపరచినట్టు పోలీసులు తెలిపారు. మృతులు ఎవరు? ఎక్కడి వారు? కుటుంబ సభ్యుల వివరాలు లేకుండానే గోదాం యజమాని పనిలో చేర్చుకున్నట్టు పోలీసులు తెలిపారు.
అడ్రస్‌ప్రూఫ్ లేకుండానే కార్మికులను పనిలో చేర్చుకున్నందుకు, ఎలాంటి అనుమతిలేకుండా గోదాం నిర్వహిస్తున్నందుకు, కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు పలు సెక్షన్ల కింద గోదాం యజమాని ప్రమోద్‌కుమార్‌పై కేసులు నమోదయ్యాయి. ఇదిలావుండగా సంఘటనస్థలాన్ని పరిశీలించిన జిహెచ్‌ఎంసి అధికారులు కూలర్ల గోదాంకు ఎలాంటి అనుమతిలేదని స్పష్టం చేయగా, తాను అరు నెలల క్రితమే అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నానని గోదాం యజమాని ప్రమోద్‌కుమార్ చెప్పడం గమనార్హం.