తెలంగాణ

ధర్నా చౌక్ తరలిలింపు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 23: హైదరాబాద్ నడిబొడ్డున ఇందిరాపార్కు సమీపంలో ఉన్న ధర్నా చౌక్‌ను మార్చాలని పోలీస్ శాఖ యోచిస్తోంది. రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ, సిఎం, గవర్నర్ల క్యాంప్ ఆఫీసులు సమీపంలో ఉన్నందున శాంతిభద్రతల సమస్య తలెత్తుతోందని, ధర్నా, ర్యాలీలతో ట్రాఫిక్ సమస్య కూడా ఉత్పన్నమవుతున్న దృష్ట్యా ధర్నా చౌక్‌ను ఇందిరాపార్కు నుంచి నగరశివారుకు మార్చేందుకు పోలీస్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు 50 ఎకరాల స్థలాన్ని సేకరించేందుకు కసరత్తు చేపట్టినట్టు తెలిసింది. ధర్నాలు, ర్యాలీల వల్ల ట్రాఫిక్ స్తంభించి, తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, వెంటనే ధర్నా చౌక్‌ను వేరే చోటకు మార్చాలంటూ స్థానికులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివిధ రాజకీయ పార్టీలు, పలు సంస్థలు, ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు ధర్నాలు నిర్వహించుకునేందుకు వీలుగా నగరశివారులోని ఉప్పల్ లేదా నాగోల్‌లో ధర్నాచౌక్‌ను ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్టు తెలిసింది.

చిత్రం.. గురువారం హైదరాబాద్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న విద్యార్థి సంఘాల నేతలను అరెస్టు చేస్తున్న పోలీసులు