తెలంగాణ

మోదీ పారదర్శక పాలనకు నిదర్శనం ముంబయ ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: మహారాష్టల్రోని మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి గెలుపొందటంపట్ల కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ హర్షం వ్యక్తం చేశారు. గురువారం దత్తాత్రేయ విలేఖరులతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ పారదర్శక పాలనకు ఈ ఫలితాలు నిదర్శనమని వ్యాఖ్యనించారు. ఈ ఫలితాలను చూసైనా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆ పార్టీ గుణపాఠం నేర్చుకోవాలని దత్తాత్రేయ హితవు పలికారు. వివిధ రాష్ట్రాలలో బిజెపి గెలుపొందడం వలన దాని ప్రభావం తెలంగాణ రాష్ట్రం మీదకూడా ఉంటుందని, తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బిజెపి బలపడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత బిజెపి అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణలో పర్యటించి పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకొంటారని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని టిఆర్‌ఎస్ పార్టీ హామీ ఇచ్చిందని, ఉద్యోగ కల్పనపై తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ కోదండరాంతోసహా ఎవరికైనా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కు ఉందని వెల్లడించారు.