తెలంగాణ

వచ్చే నెలలో మళ్లీ బజాజ్ కమిటీ పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 23: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య గోదావరి జలాల మళ్లింపుపై తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు ఎకె బజాజ్ కమిటీ వచ్చే నెలలో మళ్లీ రెండు రాష్ట్రాల్లో పర్యటించనుంది. ఈ నెల రెండవ వారంలో బజాజ్ కమిటీ రెండు రాష్ట్రాల్లో పర్యటించి కృష్ణా జలాల వినియోగంపై అధ్యయనం చేసిన విషయం విదితమే. ఆంధ్ర రాష్ట్రం పట్టిసీమ ద్వారా 53 టిఎంసి నీటిని కృష్ణా డెల్టాకు మళ్లిస్తున్న విషయమై తెలంగాణ ప్రభుత్వం బజాజ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లగా, తమ పరిధిలో ఈ అంశం లేదని స్పష్టం చేసింది.
ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలవనరుల శాఖ దృష్టికి తీసుకెళ్లింది. తెలంగాణ సాగునీటి సలహాదారు విద్యాసాగర్‌రావు ఈ విషయమై కేంద్ర జలవనరుల శాఖాధికారులను కలిసి నివేదిక ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి గోదావరి జలాల నీటి మళ్లింపు వల్ల జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు.దీనిపై స్పందించిన కేంద్ర జలవనరుల శాఖ ఎకె బజాజ్ కమిటీని రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి గోదావరి జలాల మళ్లింపు, తెలంగాణ రాష్ట్రం చేస్తున్న డిమాండ్లు, వీటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని కోరినట్లు సమాచారం. మార్చి మొదటి వారంలో బజాజ్ కమిటీ ఆంధ్ర, తెలంగాణలో పర్యటించే అవకాశం ఉంది.
పట్టిసీమ లేదా పోలవరంనుంచి గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు మళ్లించిన మరుక్షణం ఎగువ రాష్టమ్రైన తెలంగాణకు కృష్ణా నదిలో అదనంగా 45 టిఎంసిలు, కర్నాటకకు 21 టిఎంసిలు, మహారాష్టక్రు 14 టిఎంసిల నీరు లభిస్తుంది.
పోలవరం ప్రాజెక్టు ఒప్పందంలోని ఈ సూత్రాన్ని వెంటనే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్రం గత రెండేళ్లుగా కేంద్రాన్ని కోరుతోంది. ట్రిబ్యునల్ పరిష్కరించాల్సిన అంశమని, కమిటీగా తాము చేసేదేముంటుందని బజాజ్ ఇటీవల పర్యటనలో తెలంగాణ అధికారులకు తెలిపారు. దీనిపై తెలంగాణ కేంద్రానికి అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర జలవనరుల శాఖ ఆదేశం మేరకు గోదావరి నీటి మళ్లింపు, తెలంగాణ కోరుతున్న డిమాండ్లకు పరిష్కారంపై బజాజ్ కమిటీ తన నివేదికను కేంద్రానికి ఇవ్వనున్నది.