తెలంగాణ

విద్యాశాఖ అడిషనల్ జెడిపై లైంగిక వేధింపుల కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 23: విద్యాశాఖ అదనపు జాయింట్ డైరెక్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. అడిషనల్ జాయింట్ డైరెక్టర్ గోపాల్‌రెడ్డిపై అదే శాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై కొన్ని రోజులుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలు తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనను హత్య చేసేందుకు కూడా ప్రయత్నించాడని ఆరోపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న గోపాల్‌రెడ్డిపై ఐపిసి 470, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. గతంలో కూడా గోపాల్‌రెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నట్టు పోలీసులు వివరించారు.