తెలంగాణ

వక్ఫ్‌బోర్డ్‌లో ఒవైసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 23:ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం మేరకు తెలంగాణకు ప్రత్యేకంగా ఏర్పాటైన వక్ఫ్‌బోర్డుకు పాలక వర్గం సభ్యుల ఎన్నిక, నామినేటెడ్ సభ్యుల నియామకంపై గురువారం మైనార్టీ సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికైన ఆరుగురు సభ్యులతోపాటు ప్రభుత్వం నామినేటెడ్ చేసిన ఐదుగురు సభ్యులతో కలిసి మొత్తం 11 మందితో కూడిన పాలకవర్గాన్ని మైనార్టీ సంక్షేమ శాఖ ప్రకటించింది. వీరంతా కలిసి శుక్రవారం వక్ఫ్ బోర్డు చైర్‌పర్సన్‌ను ఎన్నుకుంటారని ఉత్తర్వులలో పేర్కొన్నారు. హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా ఎన్నికల అధికారిగా వ్యవహరించి జరిపిన ఎన్నికలలో సభ్యులుగా హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు ఎండి సలీం, మొజం ఖాన్, జాకీర్ హుస్సేన్ (బార్ కౌన్సిల్ సభ్యుడు), మీర్జా అన్వర్ బేగ్ (మేనేజింగ్ కమిటీ), అక్బర్ నిజామొద్దీన్ హుస్సేనీ ఎన్నికయ్యారు. కాగా మాలిక్ మోతసిమ్ ఖాన్, డాక్టర్ సయ్యద్ నిస్సార్ హుస్సేన్, వాహీద్ అహ్మద్, తఫ్‌సీర్ ఇక్బాల్, మొతరామ్ డాక్టర్ సోఫియా బేగమ్‌ను ప్రభుత్వం సభ్యులుగా నియమించినట్టు మైనార్టీ సంక్షేమశాఖ జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు.