తెలంగాణ

ఆంధ్రా గ్రూప్-2 పరీక్షకు భారీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 23: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ గ్రూప్-2 స్క్రీనింగ్ పరీక్షను నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేసినట్టు కమిషన్ చైర్మన్ డాక్టర్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. పరీక్ష నిర్వహణకు తెలంగాణలో హైదరాబాద్‌లోనూ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. హైదరాబాద్‌లో 86 పరీక్ష కేంద్రాలతో పాటు ఆంధ్రాలోని 13 జిల్లాల్లో 1462 కేంద్రాలుంటాయని అన్నారు. హైదరాబాద్‌తో పాటు ఆంధ్రాలో 13 జిల్లా కేంద్రాలను రీజనల్ కేంద్రాలుగా ఏర్పాటు చేశామని, స్క్రీనింగ్ పరీక్షకు 6.57 లక్షల మంది విద్యార్ధులు హాజరుకానున్నారు. ఇప్పటికే నాలుగు లక్షలకు పైగా అభ్యర్ధులు తమ హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారని తెలిపారు. పరీక్షలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా గట్టి నిఘా ఏర్పాట్లు చేశామని ఆయన వివరించారు. ఉదయం 9.45 గంటల తర్వాత పరీక్ష హాలులోకి అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
హాల్‌టిక్కెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలని , స్క్రీనింగ్ టెస్టు మార్కులు కేవలం క్వాలిఫై కావడానికి మాత్రమే పరిగణిస్తామని ఆయన చెప్పారు.
27న ఐసెట్ నోటిఫికేషన్
ఐసెట్ నోటిఫికేషన్‌ను ఈ నెల 27న విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో ప్రవేశానికి ఐసెట్‌ను తొలిసారి ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. మార్చి 1 నుండి ఐసెట్ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్ 5 వరకూ, అపరాధ రుసుంతో కలిపి ఏప్రిల్ 26 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. పరీక్ష మే 2న నిర్వహిస్తారు. పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్టు నోటిఫికేషన్‌ను ఈనెలాఖరులో విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. పరీక్ష ఏప్రిల్ 28న జరుగుతుందని ఈసారి ఆఫ్‌లైన్‌లోనే పరీక్ష ఉంటుందని చెప్పారు.