తెలంగాణ

వక్ఫ్ బోర్డు చైర్‌పర్సన్‌గా ఎమ్మెల్సీ సలీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 24: తెలంగాణ స్టేట్ వక్ఫ్ బోర్డు చైర్ పర్సన్‌గా ఎమ్మెల్సీ సలీం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వక్ఫ్ బోర్డు కార్యాలయంలో శుక్రవారం నూతనంగా ఎన్నికైన బోర్డు సభ్యులతో పాటు నామినేటెడ్ సభ్యులు ఈ మేరకు సమావేశమై చైర్ పర్సన్‌ను ఎన్నుకున్నట్టు వక్ఫ్ బోర్డు సిఇవో అసదుల్లా అధికారికంగా ప్రకటించారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు తొలి అధ్యక్షునిగా ఎన్నికైన సలీం, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2002-2004 వరకు వక్ఫ్‌బోర్డు చైర్ పర్సన్‌గా పని చేశారు. వక్ఫ్ బోర్డులో మొట్ట మొదటిసారిగా మహిళా సభ్యురాలిని ప్రభుత్వం నామినేటెట్ చేయడం మరో విశేషం. కొత్తగా ఎన్నికైన వక్ఫ్ బోర్డు సభ్యులు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, అన్యాక్రాంతమైన ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి తన వంతు కృషి చేస్తానని సలీం అన్నారు. సమావేశానికి ఎంపి అసదుద్దీన్ ఒవైసీ, నామినేటెడ్ సభ్యుడు తఫ్‌సీర్ ఇక్బాల్ స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో గైర్హాజర్ అయినట్టు బోర్డ్ సిఇవో పేర్కొన్నారు.

చిత్రం..ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలిసి పుష్పగుచ్ఛం అందజేస్తున్న వక్ఫ్ బోర్డు చైర్ పర్సన్ సలీం, ఇతర సభ్యులు. చిత్రంలో డప్యూటీ సిఎం మహమూద్ అలీ ఉన్నారు.