తెలంగాణ

‘వర్శిటీల్లో దేశ వ్యతిరేక చర్యలను సహించొద్దు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 24: విశ్వవిద్యాలయాల్లో దేశ వ్యతిరేక చర్యలను సహించొద్దని తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎల్ అయ్యప్ప పేర్కొన్నారు. ఈ నెల 21న ఢిల్లీ యూనివర్శిటీ పరిధిలోని రాంజస్ కాలేజీలో ఇంగ్లీషు డిపార్టుమెంట్ నిర్వహించిన కల్చరల్ ఫెస్టివల్‌లో జెఎన్‌యు ఘటనలో వివాదాస్పద వ్యక్తులు ఉమర్ ఖలీద్, షీలా రషీద్‌లు పాల్గొనడమే గాక, జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. ఇలాంటి చర్యలను అడ్డుకోవాలని ఆయన కోరారు. కాశ్మీర్ యంగ్ అజాదీ, బస్తర్ మాంగే అజాదీ అంటూ దేశ వ్యతిరేక నినాదాలు ఇచ్చారని అన్నారు. ఇది గమనించిన సాధారణ విద్యార్థులు వెళ్లి ప్రశ్నించడంతో వాగ్వాదం జరిగిందని పేర్కొన్నారు.