తెలంగాణ

చర్చలతోనే పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 24: చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని ఇరు రాష్ట్రాల పాలకులు భావిస్తున్నారు. గవర్నర్ సమక్షంలో ఇరు రాష్ట్రాల మంత్రుల మూడవ సమావేశం ఆదివారం జరుగుతుంది. ఇప్పటికే గవర్నర్ సమక్షంలో రెండు సార్లు సమావేశం అయ్యారు. ఇరు రాష్ట్రాల మంత్రుల సమావేశం అనంతరం గవర్నర్ నరసింహన్ విజయవాడ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించారు. అదే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుతో చర్చించారు. భవనాల అప్పగింత, ఆస్తుల పంపకం వంటి అంశాలపై ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. సచివాలయంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్‌కు కొన్ని భవనాలు కేటాయించారు. రాజధాని పూర్తిగా అమరావతికి తరలి వెళ్లినందున ఈ భవనాలు తమకు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. దీనికి ఆంధ్రప్రదేశ్ సుముఖత వ్యక్తం చేసింది. ఇరు రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని భావిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ సచివాలయం పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌కు తరలి పోయింది. అదే విధంగా మార్చి మూడవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు తమ రాష్ట్రంలోనే నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. ఒక్క హైకోర్టు మినహా మిగిలిన అన్ని వ్యవస్థలు విజయవాడకు వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని భవనాలు తమకు అప్పగించాలని తెలంగాణ కోరుతోంది. జల వివాదాలు తప్ప మిగిలిన అంశాలు చర్చల ద్వారా సులభంగానే పరిష్కారం అవుతాయని మంత్రులు చెబుతున్నారు. ఆదివారం సమావేశంలో వివిధ అంశాలపై ఒక అభిప్రాయానికి వస్తాయని తెలిపారు.