తెలంగాణ

తెలంగాణ బౌద్ధ చరిత్రను వెలికితీస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 24: తెలంగాణ బౌద్ధ చరిత్రను వెలుగులోకి తీసుకు వస్తామని, దీనిలో భాగంగానే బుద్ధవనం ప్రాజెక్టును ప్రపంచ దేశాలు గర్వించే స్థాయిలో అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని యువజన, పర్యాటక శాఖ కార్యదర్శి డి వెంకటేశం తెలిపారు. తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బుద్ధవనం ప్రాజెక్టు నేతృత్వంలో రెండురోజుల పాటు నగరంలో జరిగిన అంతర్జాతీయ బౌద్ధ సదస్సు శుక్రవారం ముగిసింది. ఈ సదస్సులో వెంకటేశం మాట్లాడుతూ తెలంగాణ బౌద్ధ చరిత్రను ప్రతిబింబించే విధంగా బుద్ధవనం ప్రాజెక్టును తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. బౌద్ధ ఉత్సవాల్లో భాగంగా 25,26 తేదీల్లో తెలంగాణ చారిత్రక బౌద్ధ ప్రదేశాల విశిష్టతను చాటేందుకు విదేశీ ప్రతినిధులతో బౌద్ధ క్షేత్రాల్లో పర్యటించి తెలంగాణ బౌద్ధ విలువలను ముందు యుగాలకు అందిస్తామని బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. రెండవ రోజు సదస్సులో బ్రిటన్, ఇండోనేషియా, థాయ్‌లాండ్, తైవాన్, అమెరికా, కెనడా, శ్రీలంక, మయన్మార్ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు బౌద్ధంలో వివిధ కోణాలను, ఆధునిక సమాజంలో వాటి సహేతుకతలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అన్నారు.
సీనియర్ పాత్రికేయుడు కె రామచంద్రమూర్తి, రాష్ట్ర విద్యా కమిషనర్ ప్రొఫెసర్ సంకసాల మల్లేష్, ఐఎఎస్ అధికారి రాజశేఖర్ ప్రసంగించారు. బౌద్ధ క్షేత్రాలను ప్రోత్సహించి విదేశీ పర్యాటకులను ఈ ప్రదేశాలకు ఆకర్షించేందుకు చర్యలు తీసుకోవాలని చర్చించారు. కెవై రత్నం, చెన్న బసవయ్య, లింబాద్రి, వినయ్‌కుమార్ తదితరులు మాట్లాడారు.

చిత్రం..బౌద్ధ సదస్సు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులకు
జ్ఞాపికలను బహూకరిస్తున్న పర్యాటక శాఖ కార్యదర్శి వెంకటేశం