తెలంగాణ

వడగాలులపై సంక్షిప్త సందేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 24: వచ్చే వేసవి కాలంలో ప్రజలను వడగాడ్పుల తీవ్రతపై అప్రమత్తం చేసేందుకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించింది. సమాచార టెక్నాలజీ విభాగం డిజాస్టర్ మేనేజిమెంట్ పోర్టల్‌ను ఇప్పటికే ప్రారంభించింది. దీని ద్వారా గ్లోబల్ ఫోర్‌కేస్టింగ్ సిస్టమ్‌ను ఉపయోగించి వేడి గాలుల తీవ్రతను పసిగట్టి ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తుంది. ప్రజలకు మొబైల్ ఫోన్ల ద్వారా వార్నింగ్ సందేశాలను ఇస్తారు. రాష్ట్రంలో 885కు పైగా ఆటోమ్యాటిక్ వాతావరణ స్టేషన్ సెన్సార్లను నెలకొల్పారు. వీటి ద్వారా సమాచారాన్ని సేకరిస్తారు. ఈ వ్యవస్థను భారత వాతావరణ శాఖ, రాష్ట్ర ప్రణాళిక విభాగం ఉమ్మడిగా పర్యవేక్షిస్తాయి. 885 స్టేషన్లలో నెలకొల్పిన సెన్సార్ల ద్వారా గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ వివరాలను సేకరిస్తారు. గాలి వేగం వివరాలను కూడా రికార్డు చేస్తారు. వేడిగాలుల తీవ్రత ఉంటే వెంటనే గమనించి మొబైల్ సర్వీసు ప్రొవైడర్లకు సమాచారం ఇస్తారు. మొబైల్ ఫోన్ ప్రొవైడర్లు ప్రభావితప్రాంతాల్లోని ప్రజలకు ముందస్తుగా సంక్షిప్త సమాచారాన్ని వేడిగాలులపై ఇచ్చి ప్రజలను అలర్ట్ చేస్తాయి. టెక్నాలజీని వినియోగించుకుని ప్రజల ఆరోగ్య పరిరక్షణకు వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టామని రాష్ట్ర ఐటి విభాగం కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు.
ఐటి శాఖ ప్రారంభించిన డిజాస్టర్ మేనేజిమెంట్ పోర్టల్‌ను సమర్థంగా పర్యవేక్షించేందుకు సైంటిస్టుల సేవలను వినియోగించుకుంటున్నారు. దేశంలో తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం వాతావరణ వివరాలను ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ప్రజలకు చేరవేసేందుకు వినూత్న పద్ధతిని ఆచరిస్తున్నట్లు ఆయన చెప్పారు. దాదాపు 2.5 కోట్ల మంది ప్రజలకు ఈ సేవలను అందిస్తామన్నారు. వేసవి కాలం తర్వాత వరదలు, వర్షాలపై ప్రజలను పోర్టల్ సేవలతో అప్రమత్తం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐటి, ప్రణాళిక శాఖలు నిర్ణయించాయి.