తెలంగాణ

వీరన్న దయతోనే తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, ఫిబ్రవరి 24: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన మొక్కు తీర్చుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ప్రభుత్వం తరఫున కురవి వీరభద్రస్వామికి బంగారు కోర మీసాలు చేయిస్తానని మొక్కుకున్నారు. స్వామి దయతోనే రాష్ట్రం సిద్ధించిందని పేర్కొంటూ.. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సీఎం కేసీఆర్ శుక్రవారం ఉదయం 11.00 గంటలకు ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో కురవికి చేరుకొని శ్రీ వీరభద్రస్వామిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి బంగారు కోరమీసాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు స్థానిక ఎమ్మెల్యే రెడ్యానాయక్‌తోపాటు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, అజ్మీర చందులాల్, ఎంపిలు, ఎమ్మెల్యేలు అపూర్వ స్వాగతం పలికారు. స్వామి దర్శనం అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కురవి వీరభద్రుడు మహిమాన్వితుడని స్వామి దయవల్లే ప్రత్యేక రాష్ట్రం సిద్దించిందన్నారు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కూడా పూర్తికావాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. వందలాది సంవత్సరాల చరిత్ర ఉన్న వీరన్న ఆలయ అభివృద్ధికి రూ.5కోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అసరమైతే మరో కోటి ఇస్తానని.. కురవి ఆలయ రూపురేఖలు మార్చే విధంగా ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు పురుషులకు, స్ర్తిలకు వేర్వేరుగా స్నానఘట్టాలు నిర్మించాలన్నారు. మహిమాన్వితుడైన వీరభద్రుని దయ వల్లనే 15 సంవత్సరాల క్రితం ఆలయ దర్శనానికి వచ్చానని గుర్తుచేసుకున్నారు. కురవి వీరభద్రుని దయతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడిందని తెలంగాణ ప్రజలు తమ ఆకాంక్ష మేరకు స్వరాష్ట్రాన్ని సాధించుకున్నారన్నారు. భగవంతునికి మొక్కిన మొక్కులను తెలంగాణ ప్రజల పక్షాన తీర్చుకునేందుకు రావడం జరిగిందని, ఈ రోజు కురవి ఆలయాన్ని సందర్శించడం ఆనందంగా ఉందన్నారు. చారిత్రాత్మకమైన కురవి దేవాలయాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లేందుకు సంపూర్ణ సహకారాన్ని అందచేస్తానని తెలిపారు. దేవుళ్లకు కానుకల సమర్పణపై కొందరు సన్యాసులు మాట్లాడుతున్నారని అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. ప్రతి పక్షాలు వారి ధోరణిని మార్చుకోవాలన్నారు. అంతకు ముందు ముఖ్యమంత్రి హెలిప్యాడ్ నుండి ప్రత్యేక బస్సులో ఆలయ ప్రాంగణానికి చేరుకుంటున్న క్రమంలో భక్తులు, స్థానిక ప్రజలు, టిఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘనస్వాగతం పలికారు. భద్రతా కారణాల రీత్యా సీఎం రాకకు అరగంట ముందు నుండే భక్తులకు స్వామి దర్శనం నిలిపివేశారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అనంతరం అక్కడి నుండి ప్రత్యేక బస్సులోనే నేరుగా డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ స్వగ్రామమైన చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లికి బయలుదేరి వెళ్లారు.

చిత్రాలు..సిఎం కెసిఆర్ స్వామివారికి సమర్పించిన బంగారు కోరమీసాలు
* స్వామివారిని వేడుకుంటున్న సిఎం కెసిఆర్

*స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్న సిఎం కెసిఆర్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి