తెలంగాణ

ఇక హిందువులే మైనారిటీలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్: హిందూ దేశంలో రాబోవు కాలంలో హిందువులే మైనారిటీలుగా మారే ప్రమాదం ఉందని విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) అంతర్జాతీయ కార్యాధ్యక్షులు ప్రవీణ్ తొగాడియా అన్నారు. ఆదివారం కరీంనగర్‌లో కరీంనగర్, జగిత్యాల, మంచిర్యాల, గోదావరిఖనిలకు చెందిన విహెచ్‌పి, బజరంగ్‌దళ్ కార్యకర్తల ఒకరోజు అభ్యాసవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తొగాడియా హాజరయ్యారు. ఈ సందర్భంగాం కార్యకర్తలకు మార్గదర్శనం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హిందువులు మైనారిటీలుగా మారడానికి ఇతర మతస్థులు కుటుంబ నియంత్రణ పాటించకపోవడం మొదటి కారణం కాగా, హిందువులు ఇతర మతాల్లోకి మారడం రెండవ కారణంగా చెప్పుకొచ్చారు. భారతమాతాకీ జై అన్న వారంతా మా సోదరులేనని అన్నారు. భారతదేశం అంటే ఇష్టం లేనివారికి ఈ దేశంలో స్థానం లేదని, ఇక్కడ పుట్టిన వారు మా సోదరులేనని అన్నారు. దేశంలో ఉంటూ శతృత్వం కావాలనే వారిని ఏం చేయలేమని తెలిపారు. భారతదేశం అనాదిగా హిందు దేశమని, ఆ రోజుల్లో ఆర్‌ఎస్‌ఎస్, విహెచ్‌పిలు లేవని, హిందువుల్లో ఉన్న శ్రద్ధతోనే హిందూత్వం పెరిగిందని అన్నారు. ఆయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రభుత్వం చట్టం తేవాలని కోరారు. శ్రీరామ నవమి రోజున వెయ్యి గ్రామాల్లో లక్ష మందితో రామ మందిర నిర్మాణ సంకల్పంతో ‘రామ మహోత్సవం’ నిర్వహించనున్నట్లు తెలిపారు. విహెచ్‌పి పేదల కోసం, కార్యకర్తల కోసం, హిందూ ధర్మం, హిందూ రాష్ట్రం కోసం పనిచేస్తుందని చెప్పారు. హిందువులు హిందువులుగా జీవించేందుకు తగిన మార్గం ఎన్నుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, హిందువులంతా జాగృతం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో విహెచ్‌పి నాయకులు రామరాజు, జగన్ మోహన్ రావు, కేశవరావు, కిషన్ రావు, బుస్స శ్రీనివాస్, రాజేందర్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, భేతి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

విహెచ్‌పి, భజరంగ్‌దళ్ కార్యకర్తల అభ్యాస సమావేశంలో మాట్లాడుతున్న ప్రవీణ్ తొగాడియా