తెలంగాణ

హరోం హర.. శంభో శంకర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 24: శివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం తెల్లవారుజాము నుంచే ‘హోరోం హర...ఓం నమశ్శివాయ’ అని భక్తుల నినాదాలతో రాష్ట్రంలోని శివాలయాలు మార్మోగాయి. ప్రాశస్త్యమైన కీసర గుట్ట, వేములవాడ రాజన్న, హన్మకొండలోని వేయి స్తంభాల గుడి, కాళేశ్వరం, జోగులాంభ, ఏడు పాయల దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. ఇంకా యాదాద్రి, సంస్థాన్ నారాయణపురం, రాష్ట్రంలోని వివిధ విశ్వనాథ ఆలయాలు కిటకిటలాడాయి. భువనగిరి మండలం, నాగిరెడ్డిపల్లి గ్రామంలో రమణానంద మహార్షి ప్రత్యేక పూజలు జరిపారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, విఐపిలు ఆలయాల్లో పూజలు నిర్వహించారు.
క్రిక్కిరిసిన వేములవాడ
ఇల కైలాసంగా పేరొందిన వేములవాడ, రాజరాజేశ్వర స్వామి దేవాలయం క్రిక్కిరిసింది. సుమారు సుమారు 3 లక్షల వరకు భక్తులు తరలి రావడంతో చుట్టుపక్కల రోడ్లు ట్రాఫిక్‌జామ్ అయ్యాయి. ఆలయంలో అత్యంత వైభవంగా వేడుకలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ మండలి చైర్మన్ రసమి బాలకిషన్, ఎమ్మెల్యేలు రమేశ్ బాబు, గంగుల కమలాకర్, జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ, కలెక్టర్ కృష్ణ భాస్కర్, తిరుమల తిరుపతి దేవస్థానం తరపున దేవస్థానం జెఇవో శ్రీనివాస రాజు, అర్చక బృందం దేవదేవునికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సాయంత్రం కల్యాణ మండపం8లో 11 మంది రుత్వికులు, వేద పండితులతో మహా లింగార్చన కన్నుల పండువగా జరిగింది.
కాళేశ్వరంలో..
మహాదేవ్‌పూర్ మండలంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో మహాదేవుని దర్శనార్థం భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. మంథని ఎమ్మెల్యే పుట్ట మధుకర్ కుటుంబ సమేతంగా మహాదేవున్ని దర్శించుకున్నారు. మాజీ మంత్రి డి. శ్రీ్ధర్ బాబు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఏడు పాయలలో..
రాష్ట్రంలో అతిపెద్ద రెండవ జాతరగా పేరుగాంచిన మెదక్ జిల్లా, పాపన్నపేటలోని ఏడుపాయల వనదుర్గా భవానీ మాత పుణ్యక్షేత్రంలో మహా శివరాత్రి ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీష్ రావు వనదుర్గా మాతకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ రాజమణి మురళీ యాదవ్ తదితరులు హాజరయ్యారు. ఆలయ ఇవో టి. వెంకట కిషన్‌రావు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో, డప్పువాయిద్యాలతో వారికి ఘన స్వాగతం పలికారు. రంగారెడ్డి జిల్లా కీసర మండలంలోని కీసర దేవాలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.
జోగులాంబ గద్వాలలో..
జోగులాంబ గద్వాలలో ప్రజలు శివనామ స్మరణతో ఉపవాస దీక్షలు చేపట్టారు. పండ్లు, పూల వ్యాపారులు అధిక ధరలకు విక్రయించారు. కొల్లాపూర్ మండలంలోని సోమశిలలో శివనామస్మరణతో మార్మోగింది. సప్తనదులు సంగమమైన కృష్ణా నదిలో పెద్ద ఎత్తున భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి తమ ఇష్టదైవమైన శ్రీ లలిత సోమేశ్వరుని దర్శించుకున్నారు. కృష్ణా నదిలో నీటి మట్టం బాగా తగ్గడంతో భక్తులు కాలి నడకన వెళ్ళి దర్శించుకున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలోని భౌరపూరం చెంచు పెంటలో ఉన్న పురాతన భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవాలయం ఆవరణలో భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి కళ్యాణాన్ని చెందుచల పండుగకు చుట్టుపక్కల నుంచి చెంచులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కురవి వీరభద్రుని, భద్రకాళి అమ్మవారల దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది.