తెలంగాణ

చంచల్‌గూడ జైలులో ఈ-ములాఖత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/సైదాబాద్, ఫిబ్రవరి 25: జైలులోని ఖైదీలను కుటుంబ సభ్యులు, బంధువులు కలుసుకునేందుకు వీలుగా తెలంగాణ జైళ్లశాఖ ఈ-ములాఖత్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఖైదీల బంధువులు, స్నేహితుల కోసం రాష్ట్రంలో మొదటిసారిగా చంచల్‌గూడ జైలులో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ-ములాఖత్ కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే విధానాన్ని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, జైళ్లశాఖ డిజి వికె సింగ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నాయిని మాట్లాడుతూ ఖైదీలను కలుసుకునేందుకు ఎన్‌పిఐపి వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా తెలంగాణ జైళ్లశాఖ ఇలాంటి సదుపాయాన్ని కల్పించడం హర్షణీయమన్నారు. దక్షిణ భారతదేశంలోని ఏ జైల్లో లేని విధంగా ఈ-ములాఖత్ వ్యవస్థను తెలంగాణ జైళ్లశాఖలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. గతంలో ఉత్తర భారతదేశంలో కేవలం తీహార్ జైల్‌లో మాత్రమే ఇలాంటి వ్యవస్థ ఉండేదని, ప్రస్తుతం రెండోదిగా తెలంగాణలోని చంచల్‌గూడ జైల్లో ఆవిష్కరించడం శుభ పరిణామమని మంత్రి నాయిని పేర్కొన్నారు. ఇక్కడి జైల్లో వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఖైదీల బంధువులు కూడా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారికి సమయం కేటాయించి ఖైదీలను కలుసుకునే వెసులుబాటు దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.
నేషనల్ ప్రిజనర్ ఇన్‌ఫర్మేషన్ పోర్టల్ (ఎన్‌పిఐపి) తెరిచి అందులో సూచించిన విధంగా ఆధార్ నెంబర్‌తో సహా వివరాలు తాము కలుసుకోబోయే ఖైదీ వివరాలు, ఆయనతో ఉన్న సంబంధాలు, తాము ఎప్పుడు ఏ సమయానికి కలవాలని అనుకుంటున్నారో.. తదితర వివరాలు నమోదు చేయాలి. జైలు అధికారులు ఆ వివరాలు పరిశీలించి నిబంధనల మేరకు అవకాశం ఉంటే ఒప్పుకున్నది లేదా? తిరస్కరించినది తిరిగి సమాధానం ఇస్తారు. దాంతో ములాఖత్ కోసం గంటల సేపు ఎదురు చూసే ప్రయాస తప్పి తాము నమోదు చేసుకున్న సమయానికి ఆన్‌లైన్ ప్రింట్‌ఔట్‌తో జైలు వద్దకు వచ్చి ఖైదీలను కలువచ్చని ఆయన వివరించారు. సంస్కరణల్లో దేశంలోనే ఉత్తమ జైళ్ళశాఖగా తెలంగాణ జైళ్ళశాఖ పేరుతెచ్చుకోవడంలో డిజి వికె.సింగ్, జైళ్ళ శాఖ అధికారులు, సిబ్బంది కృషి అభినందనీయమన్నారు. విద్యాభారతి, మహాపరివర్తన్, హరితహారం, స్వచ్ఛ తెలంగాణ అమలులో జైళ్ళ శాఖ విశేష కృషి జరుపుతుందన్నారు. పెట్రోల్ బంక్‌ల నిర్వహణ ద్వారా జైళ్లశాఖ ఆర్థిక పరిపుష్టిని పెంచుకోవడమే కాకుండా ఖైదీలు, విడుదలైన ఖైదీలకు ఉపాధి కల్పిస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పోలీస్‌శాఖలో అవినీతి పూర్తిగా తగ్గిందన్నారు. ఈ సందర్భంగా కొందరు శిక్షపడ్డ ఖైదీలు తమలో అర్హులైన వారికి క్షమాభిక్ష కల్పించాలని వినతి పత్రం సమర్పించారు. దానికి స్పందించిన ఆయన గత సంవత్సరం 250 మంది ఖైదీలకు క్షమాభిక్ష కింద విడుదల చేశామని, అర్హులైన మరికొందరికి కూడా రానున్న రోజుల్లో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జైళ్ళశాఖ ఐజి ఎ.నర్సింహ, సూపరింటెండెంట్‌లు సైదయ్య, బషీరాబేగం పాల్గొన్నారు.

చిత్రం..ఈ ములాఖత్ ప్రారంభిస్తున్న హోంమంత్రి నాయిని