తెలంగాణ

ఆపన్నులకు అండ మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 25: సమాజంలో అట్టడుగున ఉన్న వారికి ఉన్నత స్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోదీ పనిచేస్తున్నారని, ఆపన్నులకు పెద్ద పీట వేస్తున్నారని అందుకే ప్రధానిని పేదల పెన్నిధిగా ప్రజలు భావిస్తున్నారని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. శనివారం నాడు పార్టీ కార్యాలయంలో బిజెపి విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సభకు వెంకయ్య నాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ , పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్, ఎపి దేవాదాయ మంత్రి ఎం మాణిక్యాల రావు, తెలంగాణ శాసనసభాపక్ష నేత జి కిషన్‌రెడ్డి సహా అనేక మంది సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ నాలుగు వౌలిక పునాదులపై భారతీయ జన్‌సంఘ్‌ను దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ నిర్మించారని, 1967లో అరడజను రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే పరిస్థితి తీసుకువచ్చారని గుర్తుచేశారు. దీన్ దయాళ్ దూరదృష్టి కలిగిన వారని, వర్గ వివక్ష, ప్రాంతీయ వైషమ్యాలను పోగొట్టి జాతీయ వాద సిద్ధాంతాన్ని అమలుచేశారని, దేశం కోసం ఆర్‌ఎస్‌ఎస్, జన్‌సంఘ్‌కు మంచిమార్గదర్శకం చేశారని, గోహత్య నిషేధానికి కృషి చేశారని అన్నారు. ప్రపంచంలో భారత్ శక్తివంతమైన దేశంగా తయారవుతుందని దీన్‌దయాళ్ ఆనాడే చెప్పారని, పేదల్లో పేదవాడిని ముందుకు తీసుకురావడమే తన ప్రాధాన్యతగా చెప్పిన దీన్ దయాళ్ మాటలను ప్రధాని అనుసరిస్తున్నారని పేర్కొన్నారు.
మూడొంతుల ప్రజలు మోడీవైపే
భారతీయ జనతాపార్టీ దేశ రాజకీయ చిత్రపటంలో కాంగ్రెస్‌ను తుడిచి పెట్టేసిందని, దేశ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిందని కేంద్ర మంత్రి దత్తాత్రేయ అన్నారు. కార్మిక శాఖలోనే అనేక సంస్కరణలు చేపట్టామని, అలాగే అన్ని శాఖల్లో ప్రధాని మంచి సంస్కరణలు తీసుకువచ్చారని పేర్కొన్నారు. అన్నివర్గాల వారూ నేడు బిజెపి వైపు చేరారని, దానిని మిగిలిన పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని అన్నారు.
అన్నింటా బిజెపి విజయం
దేశవ్యాప్తంగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపికి అనుకూలంగా ఫలితాలు వచ్చాయని డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. మహారాష్ట్ర, ఒడిశాల్లో బిజెపి అభ్యర్థులు గెలిచారని 15 ఏళ్లుగా ఒడిశాలో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం కొనసాగుతున్నా ప్రజలు మార్పు చూపించారని అన్నారు. మహారాష్టల్రో రెట్టింపు శాతం ఓట్లు సాధించిందని, బిజెపి ప్రభంజనం దేశవ్యాప్తంగా చాపకింద నీరులా వీస్తోందని అన్నారు.

చిత్రం..శనివారం హైదరాబాద్ బిజెపి కార్యాలయంలో నిర్వహించిన పార్టీ విజయోత్సవ సభలో
కేంద్రమంత్రి వెంకయ్యకు మిఠాయ తినిపిస్తున్న లక్ష్మణ్.