తెలంగాణ

ఏడుపాయల్లో వైభవంగా శకట భ్రమణోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాపన్నపేట, ఫిబ్రవరి 25: ఏడుపాయల వనదుర్గామాత జాతర ఉత్సవాలు రెండవ రోజైన శనివారం అత్యంత వైభవోపేతంగా జరిగాయి. శకటభ్రమణోత్సవం, ఎడ్లబండ్ల ఊరేగింపు ప్రధాన అకర్షణగా నిలిచాయి. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు తిలకించారు. జాతరలో అతి ప్రధానమైన బండ్ల ఉరేగింపులో రంగురంగుల చీరలు, వేప కొమ్మలతో అలంకరించిన ఎడ్లబండ్లు, మెరు పు కాగితాలు, దేవతామూర్తుల పటాలతో ఆకర్షణీయంగా తిర్చిదిద్దిన గుమ్మటాల బండ్ల ఉరేగింపులో భక్తులు ఉత్సహంగా పాల్గొన్నారు. దుర్గామాతకు జైజై అంటూ భక్తులు కొండలు దద్దరిల్లేలా నినదించారు. జాతర రెండవ రోజు బండ్లు తిరిగే కార్యక్రమం ఇక్కడ ప్రధా న ఆకర్షణ. బండ్ల ముందు శివసత్తులు పూనకంతో శిగాలూగుతుండగా శకట బ్రమణోత్సవం ప్రారంభమైంది. ఆనవాయితీ ప్రకారం మొట్టమొదటిగా పాపన్నపేట సంస్థానాధీశుల తరపున పాపన్నపేట వారి ఎడ్లబండి తిరుగగా వెనుక వందలాది ఎడ్లబండ్లు వాటిని అనుసరించాయి.
మొదట తిరిగే పాపన్నపేట సంస్ధానాధీశుల బండికి తెలంగాణ శాసనసభ ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, తెరాస రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, ఆలయ ఈఓ టి.వెంకటకిషన్‌రావు, ఆర్డీఓ నగేష్, డిఎస్‌పి నాగరాజు తదితర అధికారులు ఘన స్వాగతం పలికి కొబ్బరికాయలు కొట్టి ఏడుపాయల్లో బండ్లు తిరిగే కార్యక్రమాన్ని ప్రారంభించారు. బండ్ల ముందు బైండ్లవారి డప్పుమోతలకు అనుగుణంగా యువకులు, జోగిని భక్తులు చిందులేస్తూ నృత్యాలు చేస్తున్న దృశ్యాలను భక్తులు చెట్లు, కొండలు, కోనలు, భవనాలు వాహనాలపైకి ఎక్కి చూసి పరవశించిపోయారు. భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. శివసత్తులు బండ్ల ముందు శిగాలూగుతూ చేసే నృత్యాలు, బోనాలు తీసే మహిళలు అమ్మవారికి వివిధ కళాత్మక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఏడుపాయల్లో భక్తులతో గుట్టలన్నీ నిండిపోయాయి. ఎటుచూసినా కిలోమీటర్ల కొద్ది యాత్రికులు కనిపిస్తున్నారు. ఏడుపాయల చుట్ట్టూ రాగాల కొండ, కోనలు, చిట్టడవి, మంజీర నదీపాయలు, సెలయేళ్లు, వనదుర్గామాత ఏర్పాటు చేసుకున్న ప్రకృతి రమణీయ దృశ్యాలు భక్తుల మనసులని దోచుకున్నాయి. ఎప్పుడూ నిర్మానుష్యంగా ఉండే ఏడుపాయల్లోని సుదీర్ఘ ఆలయ ప్రాంగణమంతా శనివారం పూర్తిగా జనసంద్రంగా మారిపోయింది. మిద్దెలు, మేడలు, బంగ్లాలో ఉండే పట్టణ, గ్రామీణ ప్రాంతవాసులకు మోదుగు, తంగేడు, వెదురు చలవ చాపలు కుటీర సౌదాలుగా మారాయి. ఏ చెట్టు, గుట్ట, రాయి ఏ వంక చూసినా చుట్టూ జనసమూహమే. ఏడుపాయల ఓ మహానగరంగా తలపించింది. బండ్ల ఉరేగింపు సమయంలో జాతర ప్రాంగణంలో ఇసుక వేస్తే రాలనంత జనంతో కిటకిటలాడింది. జాతరలో రెవెన్యూ, పోలీస్ అధికారులు భారీ బందోబస్తు నిర్వహించారు.

చిత్రం..జనసంద్రంగా మారిన ఏడుపాయల అమ్మవారి ఆలయ ప్రాంగణం