తెలంగాణ

చల్లంగా చూడు రాజన్న .. మళ్లీ ఏటికి వస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ, ఫిబ్రవరి 25: సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మూడురోజుల పాటు జరిగిన మహాశివరాత్రి జాతర ఉత్సవాలు ముగిశాయి. జాతరకు వచ్చిన భక్తలు శనివారం తిరుగుముఖం పట్టారు. చల్లంగా చూడు... మళ్లీయేటికి వస్తామంటూ ఆ మహాదేవున్ని శ్రమజీవులు, గిరిజనులు, అన్నదాతలు వేడుకుంటూ తమ స్వగ్రామాలకు పయనమయ్యారు. గత వారం రోజులుగా కలెక్టర్ కృష్ణ్భాస్కర్, ఎస్‌పి విశ్వజిత్ కంపాటి, ఎమ్మెల్యే రమేశ్‌బాబు జాతర సమీక్ష సమావేశాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించి వాటిని విజయవంతంగా అమలు చేయడంలో సఫలీకృతులయ్యారు. జిల్లా యంత్రాంగం ఇక్కడే తిష్టవేసి జాతర ఏర్పాట్లు పర్యవేక్షించారు. నగర పంచాయతీ వారు ట్యాంకర్‌ల ద్వారా నీటినిసరఫరా చేశారు.
దాదాపు మూడు లక్షలమంది భక్తులు స్వామివారి సేవలో తరించారు. బస్సులను సకాలంలో ఏర్పాటు చేయడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. ఆర్టీసీ అధికారులు పట్టణంలోని ప్రధాన బస్టాండ్‌తో పాటు రెండు తాత్కాలిక బస్‌స్టాప్‌లను ఏర్పాటు చేసి భక్తులకు ఎప్పటికపుడు రవాణా సౌకర్యాన్ని అందుబాటులో ఉంచారు. పట్టణంలో ఎనిమిది ప్రాంతాలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. జిల్లా ఆరోగ్య వైద్యాధికారి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. స్థానిక సత్యసాయి సేవాసమితి, వాసవిసేవ సమితి, వాసవి మిత్రమండలి సభ్యులు భక్తులకు సేవలందించారు. జాతర సమయంలో నిరంతరం విద్యుత్ సరఫరలో అంతరాయం కలుగకుండా సెస్ అధికారులు, సిబ్బంది ప్రత్యేక శద్ధ్ర కనబరిచారు.