తెలంగాణ

అప్పులతో కొత్త భవనాలు కట్టాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం కరువు కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతుంటే ముఖ్యమంత్రి కెసిఆర్ కొత్త సచివాలయం, అసెంబ్లీ, క్యాంప్ ఆఫీస్ కడతామని ప్రకటించడం మంచిదికాదని, ఇందుకు తాము వ్యతిరేకమని శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ ఆలీ అన్నారు. అప్పులు చేసి కొత్త భవనాలు నిర్మించాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. మరో ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యకలాపాలు అమరావతికి తరలిపోతున్నట్లు ఆ రాష్ట్ర సిఎం స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. ఆ భవనాలన్నీ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఉపయోగించుకుని, కొత్త భవనాలను నిర్మించే సొమ్మును రైతుల ప్రయోజనాలకు, కరవు నివారణకు వినియోగించుకోవచ్చని ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్‌కు సలహా ఇచ్చారు. ఆదివారం శాసన మండలిలో బడ్జెట్‌పై జరిగిన చర్చకు మంత్రి ఈటెల సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందని షబ్బీర్ ఆలీ మాట్లాడుతూ ఏదైనా జరగలేదని తాము నిలదీస్తే కొత్త రాష్ట్రం, అంతకు ముందు ఉన్న ప్రభుత్వం సరిగా చేయలేదని చెప్పడం, ఏదైనా జరిగిందంటే అది మా ఘనతే అంటూ చెప్పిన మంత్రి ప్రసంగం సరికాదని అన్నారు. అప్పులు భారీగా చేసే యోచనలో తెలంగాణ సర్కార్ ఉంది, అంత అప్పులు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తమ రాష్ట్రం ధనిక రాష్టమ్రని చెబుతూ అప్పులు చేయాల్సి రావడం ఏమిటని అన్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం 13 వేల కోట్లు, మిషన్ భగీరథ కోసం 40 వేల కోట్లు కలిపి మొత్తం 53 వేల కోట్లు అంటూ బడ్జెట్‌లో చూపించారని అన్నారు. అంటే అప్పు ఇంత మొత్తంలో చేస్తున్నట్లు లెక్కే కదా అని మంత్రిని అడిగారు.ప్రణాళికా వ్యయంలో 67 వేల కోట్లు చూపించారు, ప్రణాళికేతర వ్యయం తగ్గించారని గుర్తు చేస్తూ, అప్పులు, మిగిలినవన్నీ కలిపి ప్రణాళికా వ్యయంలో మొత్తం లక్ష కోట్లు వ్యయం చూపించారని అన్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు తీసుకున్న లబ్దిదారులు నుంచి పైసా వెనక్కి వచ్చేది లేదని, భగీరథ పథకం కూడా దాదాపు అంతేనని అన్నారు. 53 వేల కోట్ల అప్పులు తీర్చేందుకు వనరులు ఎక్కడ ఉన్నాయి, వాటి వడ్డీలు చెల్లించేందుకు మార్గం ఏమిటనేది బడ్జెట్‌లో మంత్రి ఎక్కడా ప్రస్తావించలేదని అన్నారు. ఇన్ని అప్పులు చేస్తూ కొత్తగా భవనాలు నిర్మించేందుకు అప్పులు చేసి ఎలా తీరుస్తారని ప్రశ్నించారు. ప్రజలపై పన్నుల భారం విధించమని హామీ ఇచ్చి ఉన్నందున ఏ రకంగా ఈ అప్పులు తీరుస్తారని అడిగారు. మరో ఎమ్మెల్సీ అల్త్ఫా హైదర రజ్వీ మాట్లాడుతూ పాత బస్తీ అభివృద్ధి కోసం ఏర్పాటైన కులీ కుతుబ్‌షా పట్టణాభివృద్ధి సంస్థకు నిధులు కేటాయించలేదని, ఉర్దూ అకాడమీ, మైనార్టీల సంక్షేమానికి నిధులు తగ్గించారని అడిగారు.

సాగర్‌కు పెరిగిన ఇన్‌ఫ్లో

నాగార్జునసాగర్, మార్చి 20: నాగార్జునసాగర్ జలాశయానికి శ్రీశైలం నుండి ఇన్‌ఫ్లో ఆదివారం నుంచి పెరిగింది. శనివారం సాగర్‌కు ప్రారంభమైన ఇన్‌ఫ్లో ఆదివారం మధ్యాహ్నానికి పెరగింది. ప్రస్తుతం సాగర్ జలాశయానికి ఆదివారం తెల్లవారుజాము వరకు 3,140 క్యూసెక్కుల నీరు వస్తుండగా మధ్యాహ్నం నుండి శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి అనంతరం 20వేల క్యూసెక్కులను సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయంలో 508.30 అడుగులు ఉండగా ఎస్‌ఎల్‌బిసి ద్వారా 1200క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో 810.80అడుగుల నీటిమట్టం ఉంది. రెండు రోజుల క్రితం శ్రీశైలం ద్వారా సాగర్‌కు నీటివిడుదల చేసి ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలకు 11టిఎంసిల నీటిని తాగునీటి అవసరాలకై విడుదల చేయాలని కృష్ణానది యాజమాన్యబోర్డు నిర్ణయించింది. ఈమేరకు 6.5టిఎంసిల నీటిని ఎడమకాల్వకు, 4.5టిఎంసిల నీటిని కుడికాల్వకు నీటివిడుదల చేయాలని ఆదేశించింది. ఈ కారణంగా శ్రీశైలం నుండి విద్యుత్ ఉత్పత్తి ద్వారా సాగర్‌కు నీటివిడుదల చేస్తున్నారు. రెండు, మూడురోజులలో కుడి, ఎడమ కాల్వలకు తాగునీటి అవసరాల నిమిత్తం డ్యాం అధికారులు నీటి విడుదల చేయనున్నారు.

అంచనాల అతిపైనే లేఖ : గుత్తా

నల్లగొండ, మార్చి 20: మిషన్ భగీరథకు హడ్కో నిధులు ఇవ్వొద్దని లేఖ రాశానంటూ ముఖ్యమంత్రి కెసిఆర్ శాసనసభలో చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని కాంగ్రెస్ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన నల్లగొండలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, మిషన్ భగీరథ అంచనాలు అతిగా ఉన్నాయని, వాటి లోటుపాట్లను పరిశీలించాకే రుణం మంజూరు చేయాలని కేంద్రానికి లేఖ రాశానన్నారు. అంతేతప్ప తాను మిషన్ భగీరథకు నిధులు ఇవ్వవద్దంటూ లేఖలో కోరలేదన్నారు. కెసిఆర్ ఆరోపించినట్లుగా తాను తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడం లేదని ప్రజలపై అప్పుల భారం మోపడంపైనే తాను ఆందోళన చెందుతున్నానన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో లక్షల కోట్ల రూపాయల అంచనాలు పెంచుతున్న కెసిఆర్ ప్రభుత్వం మిగులు రాష్ట్రంగా సోనియాగాంధీ ఇచ్చిన రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల ఊబి దిశగా తీసుకెళ్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ సమగ్రాభివృద్ధిని కోరుకుంటూ కేంద్రం నుండి తెలంగాణకు రావాల్సిన గ్రాంట్లు, ఇతర నిధుల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పోరాడుతామన్నారు. అదే సమయంలో ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపుతామని, అభివృద్ధి ముసుగులో తెరాస సాగిస్తున్న అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. మహారాష్టత్రో ప్రాజెక్టుల నిర్మాణాలకు ఒప్పందాలను స్వాగతిస్తున్నామని, అదే సమయంలో రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులైన ఎస్‌ఎల్‌బిసి, భీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మిడ్ మానేరు డ్యాం సమస్యతో ఎస్సారెస్పీ కింద రెండున్నర లక్షల ఎకరాలకు నీరందక కాలువలు వృథాగా మారాయని, ఈ తరహా తప్పులు పునరావృతం కావద్దని కోరుకుంటున్నామని సుఖేందర్ రెడ్డి తెలిపారు.