తెలంగాణ

ప్రపంచ బౌద్ధ పర్యాటక కేంద్రంగా ఫణిగిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్వపల్లి, ఫిబ్రవరి 26: తెలంగాణలోని సూర్యాపేట జిల్లా ఫణిగిరి బౌద్ధక్షేత్రం అతి పవిత్రమైందని నేపాల్ దేశానికి చెందిన ప్రపంచ బుద్ధిష్టు, పరిశోధకుడు ఆనంద్‌కుమార్ శేరి అన్నారు. ఆదివారం నాగారం మండల పరిధిలోని బౌద్ధక్షేత్రాన్ని 16 దేశాలకు చెందిన 40 మంది అంతర్జాతీయ బౌద్ధ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఫణిగిరి క్షేత్రంలో క్రీస్తు పూర్వం బుద్ధుడు ఇక్కడ తిరిగి ఆనవాళ్లు ఉన్నాయని, ఇక్కడ బౌద్ధ భిక్షకులు విద్యనభ్యసించిన చరిత్ర ఉన్నట్లు తెలిపారు. ఈ క్షేత్రాన్ని ప్రపంచంలోనే పర్యాటక క్షేత్రంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. 200 దేశాలను పరిశీలించిన తాము ఇలాంటి బౌద్ధక్షేత్రాన్ని ఇంతవరకూ చూడలేదన్నారు. జిల్లా కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్ మాట్లాడుతూ ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఫణిగిరి బుద్ధవనం క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందన్నారు. ఫణిగిరి గ్రామాన్ని ప్రపంచంలోనే ఆధ్యాత్మికకేంద్రంగా అభివృద్ధి చేసేందుకు 16 దేశాల నుండి వచ్చిన 40 మంది ప్రతినిధులు కూడా ఒప్పుకున్నట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ మాట్లాడుతూ ఫణిగిరి క్షేత్రంతో పాటు బుద్ధుడు తిరిగిన ఈ ఫణిగిరి గ్రామాన్ని కూడా అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామని, ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించడంతో పాటు ఇళ్లు లేని వారికి డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, పర్యాటకులకు విశ్రాంతి భవనం, బుద్ధుడి అవశేషాల భద్రత కోసం మ్యూజియం, గ్రామం నుండి క్షేత్రం వరకు సిసి రోడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తామన్నారు. అనంతం 40 దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు మ్యూజియంలో ఉన్న బుద్ధుడి అవశేషాలను, చరిత్ర ఆనవాళ్లను చూసి ప్రపంచ దేశాల్లో ఎక్కడా ఇలాంటి ఆనవాళ్లు లేవన్నారు. ఈ కార్యక్రమంలో పౌర సంబంధాల శాఖ ఏడి యాస వెంకటేశ్వర్లు, సహయ పౌరసంబంధాల అధికారి శ్రీనివాస్, తహశీల్దార్ సైదులు, ఎంపిపిలు దావుల మనీషా, కొమ్మినేని సతీష్, జెడ్పీటిసిలు సంద అమల, పేరాల పూలమ్మ, సర్పంచ్ యల్లమ్మ, ఎంపిటిసి కళమ్మ, పిఏసిఎస్ చైర్మన్ అశోక్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ విజయయాదవరెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు అంబయ్య, ఉప్పలయ్య, గుడిపాటి సైదులు, వీరప్రసాద్, శోభన్‌బాబు తదితరులు పాల్గొన్నారు. బౌద్ధ భిక్షకులు వచ్చినప్పటి నుండి వెళ్లే వరకు సిఐ లక్ష్మణ్, ఎస్‌ఐలు మహేష్, శ్రీనివాస్, మోహన్‌రెడ్డి, అభిలాష్, బలరాం బందోబస్తు నిర్వహించారు.