తెలంగాణ

బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే మహాజన పాదయాత్ర లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెన్‌పహాడ్, ఫిబ్రవరి 26: బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే లక్ష్యంగా మహాజన పాదయాత్ర కొనసాగుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆయన ఆదివారం సూర్యాపేట మండల పరిధిలోని అన్నారం, అనంతారం, సింగారెడ్డిపాలెం గ్రామాలకు యాత్ర చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలన్నారు. కెసిఆర్ ప్రభుత్వం సంక్షేమం గురించి మాటలు చెప్పడం తప్ప ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. పేదలందరికీ రెండు పడక గదుల ఇళ్లు, దళితులకు మూడెకరాల భూ పంపిణీ కేజిటూపిజి ఉచిత విద్య, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నామన్నారు. సామాజిక న్యాయా సాధన కోసమే ఈ మహాజన పాదయాత్ర చేపట్టామన్నారు. పేదల అభ్యున్నతి కోసమే చేపట్టిన ఈ పాదయాత్ర నేటికి 25 జిల్లాలు, 3,800 కిలోమీటర్లు, 1300 గ్రామాలు తిరిగి పేదల సమస్యలను తెలుసుకున్నామన్నారు. అనంతరం సింగారెడ్డిపాలెం గ్రామంలో పేదల కోసం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించారు. టిడిపి జిల్లా అధ్యక్షుడు పటేల్ రమేష్‌రెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దిరెడ్డి రాజాలు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించకుండా పార్టీ బలోపేతానికి ప్రాధాన్యతనిస్తుందన్నారు. దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానని మాటలు చెప్పిన కెసిఆర్ దళితులను పక్కకు పెట్టి కుటుంబ పాలన సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతుంటే ఆయన మాత్రం ప్రజల సొమ్ముతో దైవదర్శనాలు చేయడం దురదృష్టకరమన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కెసిఆర్‌కు వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చె బుతారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఈ పాదయాత్రకు టిడిపి, కాంగ్రెస్, వైకాపా నాయకులతో పాటు గ్రామపంచాయతీ వర్కర్లు, కల్లుగీత కార్మికులు, కులవృత్తి సంఘాలు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ముల్కలపల్లి రాములు, జిల్లా కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, మల్లు లక్ష్మి, కృష్ణ, భుజంగరావు, టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు జానకిరాములు, మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సూదిరెడ్డి సత్యనారాయణరెడ్డి, నల్లపు శ్రీనివాస్, నకిరేకంటి భార్గవ్, ధన్యాకుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.