తెలంగాణ

దేశంలో ఇక కాంగ్రెస్ ‘ఖేల్’ ఖతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఫిబ్రవరి 26: దేశంలో బిజెపి ప్రభు త్వం అనుసరిస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ కుదేలైపోయిందని, త్వరలోనే కాంగ్రెస్ ఖేల్ ఖతం కాబోతుందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని మురళీధర్‌రావు జోష్యం చెప్పారు. ఆదివారం సాయంత్రం కరీంనగర్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవినీతికి వ్యతిరేకంగా అధికార పగ్గాలు చేపట్టిన బిజెపి విజయపరంపర దేశంలో కొనసాగుతోందని, రాబోయే ఎన్నికల్లో కూడా అన్ని రాష్ట్రాల్లో జయకేతనం ఎగరేయడం ఖాయమని అన్నారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రజలు కేంద్ర ప్రభుత్వం వెంట ఉండి, మోదీ గ్రాఫ్‌ను మరింత పెంచి ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టారని కితాబునిచ్చారు. సంస్థాగతంగా బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో సైతం బిజెపికి అధిక ప్రాధాన్యతనివ్వడమే ఇందుకు నిదర్శనమన్నారు. త్వరలోనే కాంగ్రెస్ నుంచి ప్రజలకు విముక్తి కలిగించి, దేశానికి పట్టిన చీడను తొలగించేందుకు అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఒక్క రూపాయి సైతం క్యాష్‌లెస్ ద్వారా లావాదేవీలు కొనసాగిలా చర్యలు తీసుకుంటామని అన్నారు.
రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ మార్కు పాలన
రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ మార్కు పాలన కొనసాగిస్తోందని, అధికార నేతల అవినీతి పొంగి పొర్లుతుందని ఆరోపించారు. గుత్తేదారులు, కమీషన్‌దారులకు మాత్రమే పెద్దపీట వేస్తూ బడుగుల జీవితాలతో చెలగాటమాడుతోందని మురళీధర్‌రావు దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల నిధులను పక్కదారి పట్టించి, కమీషన్లు వచ్చే పనులకు వినియోగిస్తోందని మండిపడ్డారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, స్వచ్ఛ్భారత్, ప్రధానమంత్రి సంచయ్ యోజన నిధులు ఇతర అవసరాలకు వినియోగించినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని, వీటన్నింటినీ బహిర్గతం చేసేందుకు వీధి (క్షేత్రస్థాయి)లో ప్రజా సదస్సులు నిర్వహించేందుకు భాజపా రాష్ట్ర నాయకత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. నియామకాలు వీడి, నిరుద్యోగులకు ఉపాధి కల్పించకుండా విభజించి పాలించు అనే రీతిలో రాష్ట్రంలో పాలన కొనసాగుతోందని ఆయన దుమ్మెత్తి పోశారు. డబుల్ బెడ్‌రూమ్‌ల నిర్మాణం మ్యూజియంలో బొమ్మల మాదిరి కేవలం సిద్ధిపేటకే పరిమితమైతే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బలహీనవర్గాల ప్రజల పరిస్థితేంటని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, నగర శాఖ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, విజయేంద్రరెడ్డితోపాటు మురళీకృష్ణ, లోకేష్, సాయికృష్ణారెడ్డి, లింగంపల్లి వీరగోపాల్, మేకల ప్రభాకర్ యాదవ్, రాజేశ్వర్‌రెడ్డి, మహిళా అధ్యక్షురాలు గాజుల స్వప్న, గంట సుశీల, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న బిజెపి అగ్రనేత మురళీధర్‌రావు