తెలంగాణ

డోర్నకల్‌కు రూ.23 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 27: ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 23.25 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ సోమవారం జీఓ (జీఓ ఆర్‌టి నెంబర్ 151) జారీ చేసింది. ప్రణాళికాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బిపి ఆచార్య పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని డోర్నకల్, మరిపెడ మండల కేంద్రాలకు కోటి రూపాయల చొప్పున, మిగిలిన నాలుగు మండల కేంద్రాలకు 50 లక్షల రూపాయల చొప్పున కేటాయించారు. ఇదే నియోజకవర్గం పరిధిలోని 77 గ్రామపంచాయితీలకు 25 లక్షల రూపాయలు (ఒక్కో పంచాయితీకి) కేటాయించారు. ముఖ్యమంత్రి ఈ నెల 24 న మహబూబాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లిన సందర్భంగా డోర్నకల్‌లో ఒక ప్రకటన చేస్తూ, 23.25 కోట్ల రూపాయలు డోర్నకల్ అభివృద్ధికి ఇస్తానని ప్రకటించారు. ఈ నిధులు సక్రమంగా వినియోగం అయ్యేలా చూడాలంటూ మహబూబాబాద్ కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. మహబూబాబాద్ జిల్లా పర్యటన నుండి హైదరాబాద్ తిరిగి వచ్చిన వెంటనే సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి కెసిఆర్ సవివరంగా చర్చించి, నిధుల విడుదలకు మార్గం సుగమం చేశారు.