తెలంగాణ

క్రమబద్ధీకరణకు సభామోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (బిఆర్‌ఎస్), లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) పథకాలను చట్టం చేస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అలాగే మేయర్, స్టాండింగ్ కమిటీలకు ప్రస్తుతం ఉన్న నిధుల మంజురు పరిధిని పెంచుతూ ప్రవేశపెట్టిన బిల్లును కూడా సభ ఆమోదించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇంటి పన్నును రూ.1200 నుంచి రూ. 101 వరకు తగ్గిస్తూ ఎన్నికల ముందు చేసిన సవరణలకు కూడా సభ ఆమోదం తెలిపింది. శాసనసభలో సోమవారం సాయంత్రం మున్సిపల్ చట్ట సవరణ బిల్లు, ఎల్‌ఆర్‌ఎస్, బిఆర్‌ఎస్ బిల్లులను మున్సిపల్ శాఖ మంత్రి కె తారకరామారావు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బిల్లులను మంత్రి వివరిస్తూ ఎల్‌ఆర్‌ఎస్, బిఆర్‌ఎస్ పథకాల కింద దరఖాస్తులను ఆహ్వానించగా, ఎల్‌ఆర్‌ఎస్ కింద 2 లక్షల 96 వేల దరఖాస్తులు, బిఆర్‌ఎస్ కింద 2 లక్షల 850 దరఖాస్తులు వచ్చాయన్నారు. వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు దోహదం కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు ఆమోదానికి సభ ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. బిల్లు ఆమోదానికి మద్దతు ఇస్తున్నట్టు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తో సహా ఇతర విపక్షాలు సంపూర్ణ మద్దతు పలికాయి. అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్ట సవరణలో ప్రతిపాదించినట్టుగానే ఇతర కార్పొరేషన్లలో కూడా ఆస్తి పన్నును 12వందల నుంచి రూ. 101 తగ్గించాలని కాంగ్రెస్ సభ్యుడు పువ్వాడ అజయ్‌కుమార్ కోరారు. అయితే హైదరాబాద్‌లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఆస్తి పన్ము తగ్గించామని, ఇతర కార్పొరేషన్లలో తగ్గించడం సాధ్యం కాదని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. ఎల్‌ఆర్‌ఎస్, బిఆర్‌ఎస్‌లకు గడువు పెంచాలని ఎంఐఎం సభ్యుడు బలాలా చేసిన విజ్ఞప్తిని మంత్రి కెటిఆర్ తిరస్కరించారు. ఇప్పటికే రెండు పర్యాయాలు గడువు పెంచామని, ఇక పెంచడం సాధ్యం కాదని మంత్రి స్పష్టం చేశారు. వీటికి గతంలో చట్టం లేకపోవడంతో దరఖాస్తు చేసుకోవడానికి ప్రజలు ముందుకురాలేదని, చట్టం చేయడంతో గడువు పెంచాలని ఎమ్మెల్యే బలాలా పదే పదే విజ్ఞప్తి చేశారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు. మేయర్లకు ప్రస్తుతం రూ. 50 లక్షల వరకు నిధులు మంజురు చేసే అధికారాన్ని రూ. 2 కోట్లకు, మున్సిపల్ స్టాండింగ్ కమిటీలకు ప్రస్తుతం ఉన్న రూ. 2 కోట్ల పరిధిని రూ. 3 కోట్లకు, అలాగే ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గాల జనరల్ బాడీలకున్న రూ. 5 కోట్లు మంజురు చేసే అధికారాన్ని ఉ. 6 కోట్లకు పెంచుతూ చేసిన చట్ట సవరణకు కూడా శాసనసభ ఆమోదం తెలిపింది.