తెలంగాణ

మార్చిలోగా సిసి రోడ్లు పూర్తిచేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 27: గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం పనులు నత్త నడకన సాగడం వల్ల నిధులు మురిగిపోయే ప్రమాదం ఏర్పడుతోందని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్చి 31 నాటికి సిసి రోడ్లు నిర్మాణం పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సచివాలయం నుంచి సోమవారం మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్ని జిల్లాల ఇంజనీరింగ్ అధికారులతో సిసి రోడ్ల నిర్మాణంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటి వరకు జిల్లాల్లో ప్రతిపాదించిన రోడ్లు, పరిపాలనా పరమైన అనుమతులు మంజూరైన రోడ్లు, పనులు ప్రారంభమైన రోడ్ల గురించి సమావేశంలో చర్చించారు. పలు జిల్లాల్లో అనుమతులు ఇచ్చిన తరువాత కూడా రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభించలేదని మంత్రి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మార్చి 31 లోగా రోడ్ల నిర్మాణం పూర్తి చేయకపోతే కేంద్ర నిధులు నిరుపయోగం అవుతాయనే విషయాన్ని అధికారులు గుర్తుంచుకొని పనుల్లో వేగం పెంచాలని అన్నారు. గ్రామ సభల తీర్మానాలను త్వరితగతిన తెప్పించుకోవాలని , ఆ దిశగా అధికారులకు అవగాహన కల్పించాలని సూచించారు. అదే విధంగా 20శాతం కంట్రిబ్యూషన్‌కు ఇచ్చిన లేఖలు చాలవని, వచ్చే అర్థిక సంవత్సరం నిధుల నుంచి కూడా ఈ మొత్తాన్ని తీసుకొనే వెసులుబాటు ఉంటుందని చెప్పారు. స్థానిక ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడి పనులు ప్రారంభించేట్టు, వేగంగా జరిగేట్టు చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో ఈఎన్సీ సత్యనారాయణరెడ్డి, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సైదులు ఇతర అధికారులు పాల్గొన్నారు.