తెలంగాణ

కవ్వాల్, అమ్రాబాద్‌లో సాయుధ నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 27: వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని కఠినంగా అమలు చేసి, వన్యప్రాణులను రక్షించనున్నట్టు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. సచివాలయంలో సోమవారం రాష్ట్ర వన్యప్రాణుల మండలి సమావేశం జరిగింది. వన్యప్రాణుల చట్టాలను మరింత కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. వన్యప్రాణులను వేటాడే వారి భరతం పడతామని హెచ్చరించారు. వేటగాళ్ల కదలికలపై నిరంతరంగా నిఘాను ముమ్మరం చేస్తున్నట్టు చెప్పారు. కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లలో సాయుధ బలగాల నేతృత్వంలో నిఘాను మరింత పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని వన్య ప్రాణుల దాహాన్ని తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, నీటిపారుదల ప్రాజెక్టుల పనులకు వన్యప్రాణుల బోర్డు సమావేశంలో క్లియరెన్స్ ఇచ్చారు. తుది అనుమతి కోసం కేద్ర బోర్డుకు నివేదించాలని నిర్ణయించారు. ఆదిలాబాద్ జిల్లా గుడి హత్నూర్ నుంచి మంచిర్యాల మధ్య మార్గంలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ద్వారా భారీ వాహనాల రాకపోకలపై అధ్యయనానికి నలుగురు సభ్యులతో కమిటీని నియమిస్తూ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో బోర్డు సభ్యులు, ఎమ్మెల్యేలు బాపూరావు రాథోడ్, గువ్వల బాలరాజు, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బిఆర్ మీనా, పిసిసిఎఫ్ ప్రశాంత్‌కుమార్ ఝా, వైల్డ్‌లైఫ్ హెడ్ మనోరంజన్, భాంజా, బోర్డు సభ్యుడు జనార్దన్ రాథోడ్, అదనపు డిజిపి జితేందర్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సోమవారం హైదరాబాద్‌లో జరిగిన వన్యప్రాణుల మండలి సమావేశంలో సభ్యులు, అధికారులతో చర్చిస్తున్న మంత్రి జోగురామన్న