తెలంగాణ

రోడ్డెక్కిన కంది రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఫిబ్రవరి 27: కంది రైతులు మరోసారి రోడ్కెక్కి తమ నిరసన గళం వినిపించారు. సోమవారం నుండి నల్లగొండ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తున్నామంటూ చెప్పి అందుకు ఏర్పాట్లు చేయకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేస్తు కందులను మార్కెట్‌కు తీసుకవచ్చిన రైతులు రాస్తారోకో చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. పత్తి సాగు వద్దన్న ప్రభుత్వం మాటలు విని ఈ దఫా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెద్ద ఎత్తున కంది సాగు చేసిన రైతులు తమ కంది దిగుబడులకు సరైన మార్కెంటింగ్ సౌకర్యం లేక నానాపాట్లు పడుతున్నారు. సూర్యాపేట, చండూర్, చౌటుప్పల్ మార్కెట్‌లను ముంచెత్తిన కంది దిగుబడుల సమస్య నేపథ్యంలో వరుసగా రైతులు ఆందోళనకు దిగారు. కొత్తగా నల్లగొండ మార్కెట్‌లో సోమవారం నుండి కంది కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు ముందస్తు ప్రకటన చేశారు. దీంతో సోమవారం నల్లగొండ, తిప్పర్తి, కనగల్ తదితర పరిసర మండలాల నుండి కంది రైతులు ట్రాక్టర్లు, ఆటోల్లో తమ కంది దిగుబడులు మార్కెట్‌కు తీసుకువచ్చారు. అయితే మార్కెటింగ్ శాఖ అధికారులు మాత్రం కంది కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించలేదు. దీంతో తాము ఇంతదూరం రవాణ ఖర్చులు పెట్టుకుని వ్యయప్రయాసాల మధ్య కంది దిగుబడులు తీసుకువచ్చామని, తీరా ఇక్కడికి వచ్చాకా కోనుగోలు కేంద్రం ప్రారంభించలేదంటూ చెప్పడంతో తమ రవాణ ఖర్చులన్నీ వృథా అయిపోతాయని, వెంటనే కందుల కొనుగోలు జరిపించి తమకు న్యాయం చేయాలంటూ రైతులు మార్కెట్ ఎదురుగా ఉన్నా నల్లగొండ-హైదరాబాద్ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. రైతుల రాస్తారోకో సమాచారం అందుకున్న ఎస్‌ఐ రామలింగ ప్రసాద్ రైతులతో చర్చించి మార్కెట్ అధికారులతో మాట్లాడించి రాస్తారోకోను విరమింపజేశారు. అనంతరం రైతులు మార్కెట్ అధికారులతో వాగ్వానికి దిగారు. కొద్దిసేపటి పిదప గోనెసంచుల కొరతతో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభించేందుకు ఆలస్యమవుతుందని, కొనుగోలు కేంద్రం ఎప్పుడు ప్రారంభించే విషయమై పత్రికా ప్రకటన జారీ చేస్తామని అప్పటిదాకా రైతులు మార్కెట్కు కందులు తీసుకురావద్దంటూ ప్రకటన అంటించారు.
ఈ సమస్యపై జాయింట్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి సోమవారం సాయంత్రం మార్కెటింగ్ ఏడి ఆలీమ్, నల్లగొండ మార్కెట్ కార్యదర్శి సుగుణకుమారితో చర్చించి వీలైనంత త్వరగా కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు.